రాష్ట్రీయం

హోదాపై సిఎంకు శ్రద్ధలేదు: మేకపాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఎపికి ప్రత్యేక హోదా సహా రాష్ట్ర సమస్యలు పరిష్కారానికి వైకాపా సహకరిస్తుందని ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర సమస్యల పరిష్కారంపై ధ్యాస లేదని, ఎంతసేపూ వైకాపా ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవాలనే చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మహన్ సింగ్ హామీ ఇచ్చారని దాన్ని ఎన్‌డిఏ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎపికి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత టిడిపి ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకూ వైకాపా పోరాడుతుందని మేకపాటి వెల్లడించారు.