రాష్ట్రీయం

భారీగా కాంట్రాక్టు సిబ్బంది నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: పలు ప్రభుత్వ శాఖల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో నిర్మాణ పనులు సాగుతుండడం వల్ల సిబ్బంది సమస్య తలెత్తింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తాత్కాలిక అవసరాలకు పెద్ద ఎత్తున కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించుకోవాలని నిర్ణయించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ విషయం తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఒకేసారి పలు శాఖల్లో నిర్మాణ పనులు చేపట్టారు. సిబ్బంది కొరత ఏర్పడుతున్నందున ఈ సమస్యను అధిగమించడానికి అవసరమైన ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. నిర్ణీత కాల వ్యవధి కోసం సిబ్బందిని నియమించుకోవాలని, ఏ అధికారి ఎంత పని చేయగలడో శాస్ర్తియంగా అంచనా వేసి పని విభజన చేయాలని చెప్పారు. పనుల్లో నాణ్యత పాటించడం ముఖ్యమని అన్నారు.
భవిష్యత్తులో పత్తి ప్రమాదంలో పడుతుందని ధర పడిపోతుందని ముఖ్యమంత్రి చెప్పారు. రైతులు పత్తి పంట వేసి నష్టపోవద్దని సూచించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 42లక్షల ఎకరాల్లో పత్తిపంట వేస్తున్నారని, ఆ సాగును 15 నుంచి 20లక్షల ఎకరాలకు తగ్గించాలని ముఖ్యమంత్రి సూచించారు. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబిన్, మక్కజొన్న పంటలను సాగు చేస్తే ప్రయోజనం ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. సోయాబిన్ మొక్కజొన్న విత్తనాలను వ్యవసాయ శాఖ సరఫరా చేయాలని చెప్పారు. రైతులకు ఈ విషయంలో అవగాహన పెంచాలని అన్నారు. ఈసారి వర్షపాతం బాగానే ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. పత్తిసాగును నిరుత్సాహ పరిచే విధంగా తాము ప్రణాళిక రూపొందించినట్టు వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి చెప్పారు. వ్యవసాయ శాఖను బలోపేతం చేస్తామని, ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక అధికారి ఉండే విధంగా సిబ్బంది నియామకం చేపడతామని చెప్పారు. వ్యవసాయ శాఖాధికారులకు పదోన్నతి ఇవ్వాలని, అగ్రికల్చర్ ఆఫీసర్లను వ్యవసాయ నిపుణులుగా తీర్చి దిద్దాలని అన్నారు. ప్రాజెక్టులు పూర్తయి సాగునీరు వస్తే తెలంగాణలో అద్భుతంగా వ్యవసాయం సాగుతుందని, వ్యవసాయ శాఖ బాధ్యతలు పెరుగుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. సోయాబిన్ విత్తనాలు ఇచ్చే సందర్భంలో ఐదు ఎకరాల లోపు రైతులకే వర్తింపజేయాలని, ఒకే పంట వేసే వారికి ఇచ్చే సబ్సిడీలు రెండున్నర ఎకరాలకే ఇవ్వాలనే నిబంధనను తొలగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎలాంటి బేధం లేకుండా తెలంగాణలోని రైతులందరికీ సోయాబిన్‌పై సబ్సిడీ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోయాబిన్‌ను విత్తే పరికరాలను రైతులకు సబ్సిడీపై ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాలను ముందుగానే తెచ్చుకుని నిల్వ చేసినట్టు సమావేశంలో అధికారులు తెలిపారు.
కొత్తగా నిర్మించే గోదాములను ఇప్పటికే అందుబాటులో ఉన్న గోదాములను విత్తనాలు, ఎరువులను నిల్వ చేసుకునేందుకు ఉపయోగించాలని చెప్పారు. రైతులకు అవసరం అయ్యే ఎరువులు నాలుగు లక్షల టన్నుల బఫర్ స్టాక్ నిల్వ చేసి పెట్టినట్టు మార్కెటింగ్ శాఖ ఎండి శరత్ తెలిపారు. రుణమాఫీ మూడవ విడత నిధులు విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. రైతులకు సాఫీగా రుణమాఫీ జరిగేట్టు చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. రుణమాఫీ పొందే రైతుల బ్యాంకు ఖాతాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని, ఆడిటర్ల సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.