రాష్ట్రీయం

‘విట్’ జాతీయ ఫలితాల్లో ఆంధ్ర విద్యార్థి వంశీ టాపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశపరీక్షలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సేవకుల వంశీ మొదటి ర్యాంకు సాధించారు. ఏప్రిల్ 6 నుండి 17వ తేదీ వరకూ భారతదేశంలో 118 నగరాలతో పాటు దుబై, కువైట్, మస్కట్‌లలో కూడా ఈ ప్రవేశపరీక్షను నిర్వహించారుస. విట్ ఫలితాలను గురువారం నాడు ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాధ్ ప్రకటించారు. రెండో ర్యాంకు గుజరాత్‌కు చెందిన మోహిత్ పటేల్, 3 వ ర్యాంకు ఢిల్లీకి చెందిన సత్యజిత్ ఘోష్, 4వ ర్యాంకు కర్నాటకకు చెందిన జీవన్ చంద్ర, 5వ ర్యాంకు తెలంగాణకు చెందిన శుభంకర్ జవహర్, 6వ ర్యాంకు సనిత్‌గుప్త, 7వ ర్యాంకు కుమరేష్ రమేష్, 8వ ర్యాంకు సాయిసాకేత్, 9వ ర్యాంకు విశాల్ జైన్, 10వ ర్యాంకును చరిత్‌వర్మ సాధించారు. మే 9వ తేదీన 8వేలు ర్యాంకుల లోపు వారికి కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నామని, 10వ తేదీన 12వేలు ర్యాంకుల వరకూ, 11న 16 వేల ర్యాంకుల వరకూ కౌనె్సలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. స్టేట్ బోర్డు టాపర్స్‌కు వంద శాతం ఫీజు రాయితీ ఇస్తామని, అలాగే మిగిలిన వారికి సైతం రాయితీ ఉంటుందని చెప్పారు.