రాష్ట్రీయం

వైద్యం కోసం వెళితే..ఔషధ ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: వైద్యం కోసం వెళ్లిన ఓ సినీ నిర్మాతపై ఔషధ ప్రయోగం జరిగింది. కోమాలోకి వెళ్లిన ఆ నిర్మాత మరుసటి రోజు తేరుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. ‘హార్మోన్స్’ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ఎస్‌ఎస్ నాయక్ ఇటీవల వైద్యం కోసం మంథన్ డయాబెటిస్ సెంటర్‌కు వెళ్లారు. కాగా అక్కడి వైద్యులు, సిబ్బంది జరుపుతున్న ఔషధ ప్రయోగాలలో భాగంగా సినీ నిర్మాత నాయక్‌పై ఓ ఇన్సులిన్ మందును ప్రయోగించారు. దాంతో తాను కోమాలోకి వెళ్లానని, వేరే ఆసుపత్రిలో చేరగా ఒక రోజు తరువాత కోలుకున్నట్టు నాయక్ పేర్కొన్నారు.