ఆంధ్రప్రదేశ్‌

సచివాలయం విస్తరణకు అదనంగా 530 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వెలగపూడి దగ్గర నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయం విస్తరణ, వౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రూ.530 కోట్లు మంజూరు చేసింది.
జి ప్లస్ వన్ నిర్మాణానికి తొలిదశలో రూ.22.80 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిన విషయం విదితమే. తొలుత జి ప్లస్ వన్‌గా పనులు చేపట్టిన 6 భవనాల సముదాయంలో అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు రెండు, మూడు ఫ్లోర్ల నిర్మాణానికి, సముదాయంలోని ఆరు భవనాలకు చెందిన 4 ఫ్లోర్లలో ఇంటీరియర్ వర్క్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మరియు ఎక్సటర్నల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు, అదనపు రెండు ఫ్లోర్ల డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారీకి, మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ఆర్కిటెక్ట్ సేవలు పొందేందుకు రూ.530 కోట్లు విడుదలకు ప్రభుత్వం పాలనామోదం ఇచ్చింది.