తెలంగాణ

కిరణ్ రాజకీయంగా సమాధి అయ్యారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నించిన ఉమ్మడి రాష్ట్ర చిట్ట చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయంగా సమాధి అయ్యారని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం అంధకారం అవుతుందని కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నో అబద్ధాలను ప్రచారం చేసినప్పటికీ, రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కిందని మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రముఖ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ సంస్థ కాప్రస్ ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు ఇంతకాలంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యలను అధిగమించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే, ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయన్నారు. ఎన్నికల ప్రణాళికలో తమ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతున్నామని మంత్రి అన్నారు.

పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేస్తాం

అంతర్జాతీయ స్థాయిలో స్మార్ట్ పోలీసింగ్
అధునూతన టెక్నాలజీ వినియోగం
ప్రతి పిఎస్‌లో మహిళా విభాగం
నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ.. పోలీసు రహిత సిగ్నల్ జంక్షన్లు
మీట్‌దిప్రెస్‌లో తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణలోని అన్ని పోలీసు స్టేషన్లను పటిష్టం చేస్తామని, స్మార్ట్ పోలీసింగ్ విధానంతో పోలీసు వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అనురాగ్ శర్మ అన్నారు. ఎక్కడ, ఎలాంటి నేరం జరిగినా మానిటర్ చేసే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, నేరాల అదుపునకు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నామని డిజిపి స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్సు, హైదరాబాద్ జర్నలిస్ట్సు యూనియన్ సంయుక్త్ధ్వార్యంలో ఏర్పాటు చేసిన మీట్-ది-ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతలు, ప్రజాభద్రతకోసం పోలీసులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పోలీసు వ్యవస్థ పటిష్టతకు కావలసిన రిక్వైర్‌మెంట్‌ను అందిస్తానని సిఎం భరోసా ఇచ్చారని, అందులో భాగంగానే నగరంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించి సుమారు రూ. 700 కోట్లతో సిసిసి ఏర్పాటుకు భూమిపూజ జరిపారన్నారు. జంటనగరాల్లో లక్ష సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని, నేరాల అదుపునకు టెక్నాలజీ వినియోగిస్తున్నామని అన్నారు. పోలీసు ఠాణాలు అవినీతి రహితంగా ఉండాలనే సదుద్దేశ్యంతో ఫిర్యాదుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మారుమూల ప్రాంతాల పోలీసు స్టేషన్లకు ప్రతినెలా రూ. 25వేలు, పట్టణ ప్రాంతాలకు రూ. 50వేలు, నగరంలోని పోలీసు స్టేషన్లకు రూ. 75వేలు చొప్పున నిధులు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలను అదుపులో పెట్టడానికి నూతన టెక్నాలజీ వినియోగంతోపాటు జిపిఎస్, యాప్స్‌తో ముందుకెళ్తున్నామన్నారు. పోలీసు శాఖలో కొంత సిబ్బంది కొరత కూడా ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో 18వేల ఖాళీలున్నాయని, భర్తీకి చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగానే ప్రతి పోలీసు స్టేషన్‌లో ఒక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఆ దిశగానే పోలీసు రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించినట్టు డిజిపి పేర్కొన్నారు. తెలంగాణ జిల్లాల్లోని పది పి.ఎస్.లకు కొత్త వాహనాలు ఇచ్చామని, ఐదు జిల్లాల్లో డిజిటల్ సిస్టం ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తున్నామన్నారు. ఈ విధానంతో ఫిర్యాదు దారుడి ఎఫ్‌ఐఆర్ మొదలుకొని నేరస్థులకు కోర్టు విధించే శిక్ష వరకు సమాచారం స్టోర్ అవుతుందన్నారు. రద్దీ ప్రదేశాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణతోపాటు పోలీసు రహిత జంక్షన్లు గుర్తిస్తామన్నారు. ఇప్పటికే కొన్ని ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా ఇ-చలాన్ సిస్టంను తెచ్చామన్నారు. అదేవిధంగా పోలీసులు అవినీతికి పాల్పడకుండా సిబ్బందికి 120 బాడి కెమెరాలు అందించామని, దీంతో పోలీసులు, ప్రజలతో ఏం మాట్లాడుతున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉందన్నది రికార్డు అవుతుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ దేశంలోనే తెలంగాణ ప్రథమస్థానంలో ఉందని, ఈ విధానాన్ని పలు రాష్ట్రాలు అధ్యయనం చేశాయన్నారు. పాస్‌పోర్టు వెరిఫికేషన్ గతంలో మూడు నెలలు పట్టేదని, ప్రస్తుతం వారం రోజుల్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. స్మార్ట్ పోలిసింగ్ విధానంపై ప్రజల నుంచి స్పందన రావాలని, ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా ప్రజలు తమ సూచనలు, సందేహాలు, సలహాలు చేయవచ్చని డిజిపి అనురాగ్ శర్మ సూచించారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ నగరంలో చైన్‌స్నాచింగ్‌లు తగ్గాయని, మావోల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భద్రత చర్యలు చేపట్టామన్నారు. పోలీసు శాఖలో ఏ స్థాయి అధికారైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఇటీవల కరీంనగర్‌లో వడ్డీవ్యాపారంలో కొందరిపై చర్య తీసుకున్నామని అదేవిధంగా నగరంలోని ఓ ఏసిపిపై కూడా చర్య తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఐజెయు సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, కె శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె విరాహత్ అలీ, నగర అధ్యక్షుడు కోటిరెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు