ఆంధ్రప్రదేశ్‌

హోదాపై రాజీలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 1: ‘స్వార్ధ ప్రయోజనాల కోసం తాను కేంద్రంతో రాజీపడుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం నాకెం తో బాధ కలిగిస్తోంది. అలా రాజీపడటం నా జీవితంలోనే లేదు. అయితే ప్రజల కోసం ఎలాంటి రాజీకైనా, త్యాగానికైనా సిద్ధపడతా’ అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. మేడే వేడుకల సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరగాలని ఏ ఒక్క రూ కోరుకోలేదు అయితే నాటి కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా విభజించిందన్నారు. అన్ని విధాలుగా వెనుకబడిన ఈ రాష్ట్రాన్ని కేంద్రం ఉదారంగా ఆదుకోవాలని పదే పదే కోరుతూ వస్తున్నా.. విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేయాలని కోరుతున్నా. నాడు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదాకు హామీ లభిస్తే కాదు.. 10 ఏళ్లు కావాలని నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో సహా తామందరం డిమాండ్ చేశాం అలాంటిది ఇప్పుడు ప్రత్యేక హోదా సాధ్యపడదంటే ఎలాగని ప్రశ్నించారు. ‘వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవులు వెంటాడినా దూరంగా ఉన్నాం.. అయితే నేడు ఈ రాష్ట్భ్రావృద్ధి ముఖ్యంగా విభజన చట్టంలోని హామీల సాధన కోసమే మోదీ మంత్రివర్గంలో చేరాల్సి వచ్చింది మినహా మరో కారణం లేదు’ అని వివరించే ప్రయత్నం చేశారు. అయితే నిధులు లేకపోయినా కష్టాలున్నా సంక్షేమ పథకాలన్నీ ఎలా చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తూన్నారంటూ ప్రజల సంక్షేమమే చూడని రోజున ప్రజాస్వామ్యానికి అర్ధం ఏమిటని ప్రశ్నించారు. డబ్బు లేకపోయినా మనస్సు ఉంది. ఏదో చేయాలన్న తపన ఉందన్నారు. అందుకే ఇంకా ఎక్కువ కష్టపడి అయినా ప్రజలను ఆదుకుంటామన్నారు. తనతోపాటు నాలుగైదు గంటలు ఎక్కువగా అందరూ కష్టపడితే రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉంటుందన్నారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఎదిగేవరకూ రాష్ట్రానికి సహకారం అందించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందన్నారు.