ఆంధ్రప్రదేశ్‌

కార్మికులందరికీ ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 1: రాష్ట్భ్రావృద్ధిలో ఎంతో కీలకమైన పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం ఇటు కార్మికులు, అటు యాజమాన్యాల మధ్య వారధిగా నిలవటమే గాక కార్మికులకు అన్యాయం జరుగకుండా బాధ్యత తీసుకునే పరిశ్రమల యాజమాన్యానికి అండగా నిలుస్తానం టూ ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. అలాగే తమకు ఉపాధి చూపుతున్న యాజమాన్యాల పేరు ప్రతిష్టలను పెంచే విధంగా కార్మికులు నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడ నగరంలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన ప్రసంగించారు. సభకు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని కోటీ 50 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికుల కోసం కేవలం రూ.15లకే ఐదు లక్షల ప్రమాద బీమా వర్తించే చంద్రన్న బీమా పథకానికి సంబంధించిన ఫైల్‌పై సిఎం వేదికపైనే సంతకం చేశారు. దానికి సంబంధించి కార్మిక శాఖ రూపొందించిన లఘుచిత్రం సిడిని ఆవిష్కరించారు. అంతేకాకుండా సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ దశలవారీగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. కార్మికులందరికీ ఆయా పరిశ్రమల దగ్గరలోనే ఇళ్ల నిర్మాణం చేపడతామంటూ ఇందుకు తమకు పరిశ్రమల యాజమాన్యాలు సహకరించాలని కోరా రు. గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ పథకం కింద కార్మికులకు ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. రాష్ట్భ్రావృద్ధికి పాటుపడే మొదటి కార్మికుడిని తానేనన్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు విదేశాలకు వెడితే పలువురు తప్పుబడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక, ఫ్యాక్టరీలు, బ్రాయిలర్, విద్యుత్ శాఖల అధికారులు వేర్వేరుగా తనిఖీలకు వచ్చి వేధించకుండా తనిఖీలన్నీ ఆన్‌లైన్ విధానంలోనే అమలు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. ఏరోజు ఏ సంస్థలను తనిఖీ చేయాలో ముందే తెలియజేస్తామన్నారు. తన సంస్థ నుంచే ట్యాబ్‌లో తనిఖీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఏ చెట్టు లేదా ఏ ఇంటి దగ్గరలో కూర్చుని నివేదికలు తయారుచేయడం కుదరదన్నారు. ఈ సందర్భంగా యజమానులు, కార్మికులకు శ్రమశక్తి ఉత్తమ యాజమాన్యం అవార్డులను అందజేసి అభినందించారు.

చిత్రం.. చంద్రన్న బీమా పథకం ఫైలుపై వేదికపైనే సంతకం చేస్తున్న చంద్రబాబు