రాష్ట్రీయం

అభ్యంతరాలుంటే రేపటిలోగా తెలపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 2: ఎపి ఎంసెట్-2016కు హాజరైన అభ్యర్ధులకు ఏ విధమైన అభ్యంతరాలున్నా ఈనెల 4వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాలని జెఎన్‌టియుకె స్పష్టంచేసింది. ఏప్రిల్ 29న ఎంసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. అదే రోజు ప్రిలిమినరీ కీని జెఎన్‌టియుకె ప్రకటించింది. ప్రిలిమినరీ కీపై ఏ విధమైన అభ్యంతరాలున్నా ఏప్రిల్ 30వ తేదీ నుండి ఈ నెల 4వ తేదీ వరకు దరఖాస్తుచేసుకునే అవకాశం ఉన్నత విద్యామండలి కల్పించింది. సందేహాలు, అభ్యంతరాలుంటే 4వ తేదీలోగా దరఖాస్తుచేసుకోవాలని, ఆ రోజు సాయంత్రం 4 గంటల తరువాత వాటిని పరిశీలిస్తామని ఎంసెట్-2016 కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు తెలిపారు. జెఎన్‌టియుకె ఆధ్వర్యంలో ఏప్రిల్ 29న తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్-2016ను విజయవంతంగా నిర్వహించడంతో పాటు అదే రోజు సాయంత్రం ప్రిలిమినరీ కీని విడుదల చేశామన్నారు. ఫైనల్ కీ, ఫలితాలు (ర్యాంకులు) ఈ నెల 9న విడుదల కానున్నట్టు చెప్పారు. ఎంసెట్‌పై సమస్యలు, సందేహాల నివృత్తికి 1800 425 6755 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటుచేశామన్నారు. అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మే 27న జారీచేస్తామన్నారు. జూన్ 6వ తేదీన సర్ట్ఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు చెప్పారు. జూన్ 9 నుండి 18వ తేదీ వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించామన్నారు. జూన్ 22వ తేదీ నుండి రాష్టవ్య్రాప్తంగా ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. విద్యార్థులకు జూన్ 27వ తేదీ నుండి తరగతులు ప్రారంభించడానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి సన్నాహాలు చేస్తోందన్నారు.