ఆంధ్రప్రదేశ్‌

సింహాచలం దేవస్థానం భూమిని ఖాళీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: విశాఖపట్నం జిల్లా అడవివరంలో సింహాచలం దేవస్థానానికి చెందిన స్థలం నుంచి ఆక్రమణ దారులు వైదొలగాలని హైకోర్టు ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. భూ ఆక్రమణ కేసులో ఆ భూమిని ఆక్రమించుకున్న వారు ఆ స్థలాన్ని సొంతం చేసుకోవాలంటే మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని భూ ఆక్రమణల నిరోధక ట్రిబ్యునల్‌కు ఆదేశాలు ఇచ్చే అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. భూ ఆక్రమణకు సంబంధించి ప్రత్యేక ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సింహాచలం శ్రీవరాహ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ నూతి రామ్మోహన్ రావు, జస్టిస్ శివశంకర్‌రావుతో కూడిన ధర్మాసనం విచారించింది. సింహాచలం దేవస్థానానికి చెందిన 1536 చదరపు గజాల స్థలాన్ని తుట్ట చిన్నయ్య మరో 24 మంది ఆక్రమించారని, వారిని ఖాళీ చేయించాలని కోరుతూ సింహాచలం దేవస్ధానం అధికారులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అభ్యర్ధించారు. అంతకు ముందు ట్రిబ్యునల్ సింహాచలం దేవాలయం స్థలాన్ని ఆక్రమించుకున్న వారికి గజానికి రూ. 80 చొప్పున చెల్లించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ట్రిబ్యునల్‌కు భూమి టైటిల్, యాజమాన్య హక్కులను నిర్ధారించే హక్కు ఉన్నప్పటికీ, దేవాలయ భూమికి నష్టపరిహారం చెల్లించి భూమిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవచ్చని ఆదేశాలు జారీ చేసే హక్కు లేదని హైకోర్టు పేర్కొంది. ఈ కారణంపై ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టి తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని హైకోర్టు పేర్కొంది. ఈ ఆదేశాల ఉత్తర్వులు స్వీకరించినప్పటి నుంచి మూడు నెలల్లోగా భూమిని తమ స్వాధీనంలో తీసుకున్న వారు ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.