ఆంధ్రప్రదేశ్‌

కాకినాడ వాసులపై కాశీలో హత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 3: దైవ దర్శనానికై వారణాసి (కాశీయాత్ర) వెళ్ళిన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరానికి చెందిన ఎనిమిదిమంది యాత్రికులపై అగంతకులు హత్యాయత్నానికి ఒడిగట్టారు. దుండగులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఏడుగురి ఆచూకీ గల్లంతయ్యింది. అదృష్టవశాత్తూ ఈ దాడి నుండి ప్రాణాలతో తీవ్ర గాయాలతో బయటపడిన ఓ క్షతగాత్రుడి ద్వారా ఈ దారుణం వెలుగుచూసింది. క్షతగాత్రుడు వారణాశి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. బాధితుడిని స్థానిక ఆసుపత్రిలో చేర్చడంతో చికిత్స పొందుతున్నాడు. తమపై దుండగులు చేసిన దాడి వివరాలను ఫోన్‌లో కాకినాడ నగరంలోని తమ బంధువులకు అతను మంగళవారం వివరించాడు. వాట్సాప్ ద్వారా ఫొటోలు కూడా పోస్ట్ చేశాడు. దీంతో కాకినాడ నగరానికి చెందిన బాధితుల బంధువుల్లో కలకలం రేగుతోంది. ఈ ఉదంతంపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్‌కు సమాచారం అందించారు. కాకినాడ నగరంలోని గాంధీనగర్ గొల్లపేటకు చెందిన ఎనిమిది మంది ఏప్రిల్ 29న సామర్లకోటనుండి పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరి వెళ్ళారు. మే 1న వారణాసిలో దైవ దర్శనం చేసుకున్నారు. రెండో తేదీ అర్థరాత్రి సమయంలో ఆటోలో గయ వెళ్ళేందుకు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో కొందరు అగంతుకులు వీరిపై దాడికి పాల్పడ్డారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడి తప్పించుకున్న డొక్కారి లోవరాజు (28) స్థానిక కబీర్ చౌకాయా ప్రభుత్వాసుపత్రికి చేరుకుని చికిత్స పొందాడు. కోలుకున్న అనంతరం మంగళవారం కాకినాడ నగరంలో గల తన బావమరిది ప్రసాద్‌కు ఈ విషయాన్ని ఫోన్ ద్వారా వివరించాడు. మిగిలిన ఏడుగురు బంధువులు ఏమయ్యారో తనకు తెలియడం లేదని, గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని సమాచారం అందించాడు. వాట్సాప్ ద్వారా తన ఫొటోలు కూడా బావమరిదికి పోస్టుచేశాడు. కాగా వారణాసిలో అగంతకుల దాడికి గురై అదృశ్యమైన వారిలో నమ్మి నారాయణమ్మ (65), గొర్ల మంగమ్మ (50), డొక్కారి అప్పలనరసమ్మ (45), సర్వసిద్ధి అప్పారావు (75), సర్వసిద్ధి పేరంటాలు (65), బత్తిన మాణిక్యం (50), నరాల లక్ష్మి (50) ఉన్నారు.
బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు కలెక్టర్ అరుణ్‌కుమార్ వారణాసి అడిషనల్ డిజి రత్నంను సంప్రదించారు. ఆయన వెంటనే శుక్లా అనే అధికారిని ఈ సంఘటనపై విచారణకు నియమించారు. దైవదర్శనం కోసం కాకినాడ నుండి బయలుదేరిన ఈ బృందం విజయవాడ చేరుకోగా అక్కడ మరికొందరు వీరితోపాటు వారణాసి వచ్చారని, ఆ వ్యక్తులే వీరిపై దాడికి పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం తమ వద్ద ఉందని కేసు విచారిస్తున్న శుక్లా ఉన్నతాధికారులకు వివరించినట్టు సమాచారం.
chitra...
దాడిలో గాయపడి
చికిత్స పొందుతున్న లోవరాజు