ఆంధ్రప్రదేశ్‌

ఇదేం దూకుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 3: కృష్ణ, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్‌లను అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఆంధ్ర ప్రాంత నాయకులు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగింది. కృష్ణ, గోదావరి నదీ జలాల పంపిణీ విషయంలో బోర్డు ఏర్పాటు చేసేంతవరకూ తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనివలన ఆంధ్ర ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లుతోందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రాజెక్ట్‌ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళుతోందని, దాన్ని అడ్డుకోవాలని అన్నారు. అయితే, తెలంగాణ ప్రాంత టిడిపి నాయకులు మాత్రం ప్రాజెక్ట్‌ల విషయంలో చంద్రబాబు చేస్తున్న ప్రకటనలపై కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్‌ల విషయంలో వివాదాలు తలెత్తినప్పుడు పరస్పరం ప్రకటనలు చేసుకోకుండా, కేంద్ర జోక్యాన్ని కోరాలని టిటిడిపి నేతలు చంద్రబాబుకు సూచించారు. ప్రాజెక్ట్‌ల వివాదంలో ఎపిటిడిపి నాయకులు పెద్దగా ప్రకటనలు చేయకూడదని టిటిడిపి నాయకులు కోరినట్టు తెలిసింది.
ఇదిలాఉండగా ఈ ఏడాది మహానాడును తిరుపతిలో నిర్వహించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. ఈ నెల 27,28,29 తేదీల్లో తిరుపతిలో ఈ మహా సభలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కమిటీల ఏర్పాటు బాధ్యతను మంత్రి యనమల రామకృష్ణునికి అప్పగించారు. ఇప్పటివరకూ మహానాడు ఏర్పాట్లు బాధ్యతలను తామే చూసేవారమని, ఇందులో తమకు అనుభవం ఉన్నందువలన ఈ బాధ్యతలను తమకు అప్పగించాలని టిటిడిపి నాయకులు కోరారు. అందుకు చంద్రబాబు అంగీకరించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకారం కొంతవరకూ మాత్రమే ఉందని, పూర్తి స్థాయిలో సహకరించడం లేదని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. హోదా కోసం కేంద్రంపై నిరంతరం వత్తిడి తేవాలని అభిప్రాయపడింది. ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లి కేంద్ర పెద్దల్ని కలిసినా ప్రయోజనం కనిపించలేదని, కేంద్రంలోనే లోపం ఉందన్న అభిప్రాయాన్ని పొలిట్‌బ్యూరో వ్యక్తం చేసింది.
రానున్న రాజ్యసభ స్థానాల్లో ఒక సీటును తెలంగాణకు ఇవ్వాలని టిటిడిపి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూచించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కరవుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కరవు సహాయక చర్యల్లో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై తెలంగాణలో ప్రచారం చేయాలని చంద్రబాబు టిటిడిపి నాయకులను కోరినట్టు తెలిసింది. మహానాడునాటికి సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసుకోవాలని బాబు సూచించారు. తెలంగాణకు రాజ్యసభ సీటును ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు.
ఎపిలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్లడంలో నాయకులు విఫలమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లి, పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
ప్రతిపక్ష నాయకుడు జగన్ తెలుగుదేశం పార్టీపై చేస్తున్న వ్యాఖ్యల గురించి పొలిట్‌బ్యూరోలో చర్చకు వచ్చింది. జగన్ అవాస్తవాలను జనానికి చెపుతున్నారని, పార్టీ నేతలు ఎప్పటికప్పుడు వాటిని ఖండించాలని చంద్రబాబు సూచించారు. అలాగే, జగన్ ఢిల్లీలో ప్రభుత్వం చేసిన ప్రచారాన్ని పొలిట్ బ్యూరో తీవ్రంగా పరిగణించినట్టు తెలిసింది. వైకాపా నుంచి మరికొంతమంది టిడిపిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, వారిని తీసుకోవాలని నిర్ణయించింది.
ఇదిలా ఉండగా తెలుగుదేశం నాయకురాలు బండ్రు శోభారాణి ముఖ్యమంత్రిని కలిసి తనను తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యురాలిగా నియమించమని విజ్ఞప్తి చేశారు. పరిశీలిస్తామని చంద్రబాబు చెప్పారు.
సమావేశంలో ఎపిటిడిపి అధ్యక్షుడు కళావెంకటరావు, టిటిడిపి అధ్యక్షుడు టి రమణ, యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు, రావూరి చంద్రశేఖర్, చినరాజప్ప, ప్రతిభాభారతి, మోత్కుపల్లి, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, అయ్యన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.

chitram...
విజయవాడలో నిర్వహించిన పొలిట్ బ్యూరో సమావేశంలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు