రాష్ట్రీయం

చింటూయే హంతకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 20: చిత్తూరు మేయర్ అనూరాధ దంపతుల హత్యాకాండలో తాము ముందుగా అంచనా వేసినట్లుగా ప్రధాన నిందితుడు కఠారి మోహన్ మేనల్లుడు చింటూనేనని, అతనితోపాటు రెడ్డి అలియాస్ జయప్రకాష్‌రెడ్డి, మరో ముగ్గురు పాల్గొన్నారని వీరిలో చింటూ, వెంకటేష్ పారిపోగా జయప్రకాష్‌రెడ్డి, వెంకటాచలపతి, మంజునాథ్ పోలీసులకు లొంగిపోయారని చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి కేసు దర్యాప్తుకు సంబంధించిన వివరాలు తెలియ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేయర్ అనూరాధ, కఠారి మోహన్ హత్య కేసులో వారి బంధువుల ఇళ్లలో శుక్రవారం తనిఖీలు జరిపామన్నారు. అంతేకాకుండా లొంగిపోయిన నిందితులు, వారి బంధువులు, స్నేహితులను ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నాలుగున్నర గంటల పాటు విచారించామన్నారు. ఈ సందర్భంగా అనేక విషయాలు వెలుగు చూశాయన్నారు. చింటూ, జయప్రకాష్ ముసుగులు ధరించి మేయర్ చాంబర్‌లోకి చొరబడ్డారని, వారివెంట వెంకటాచలపతి, మంజునాథ్, వెంకటేశ్ ఉన్నారన్నారు. నిందితులు రెండు 3.2 పిస్టల్, ఒక ఎయిర్ పిస్టల్, కత్తులను హత్య చేసేందుకు తీసుకెళ్లారన్నారు. చింటూ తన గన్‌తో మేయర్‌ను కాల్చడంతో ఆమె కుప్పకూలిందన్నారు. ఈ క్రమంలో కఠారి మోహన్ వారిని తోసుకొని గదినుండి వెలుపలకు పరుగెత్తారన్నారు. ఈ సమయంలో పిస్టల్‌తో మోహన్‌ను కూడా కాల్చారని అయితే అది గురితప్పి ద్వారానికి తగిలిందన్నారు. మరోసారి ప్రయత్నించడంతో పిస్టల్ పనిచేయలేదన్నారు. దీంతో కత్తులతో ఆయన వెంటపడ్డారని, మోహన్ పరుగెత్తుతూ కార్పెట్‌పై జారిపడ్డారన్నారు. దీంతో నిందితుడు అతనిపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరచారన్నారు. సంఘటన స్థలంలో కత్తిని చింటూ అక్కడే వదిలేసి దుస్తులకంటిన రక్తాన్ని బాత్‌రూమ్‌లో శుభ్రపరచుకొని వెళ్లినట్లు తమ విచారణలో తేలిందన్నారు. చింటూ పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయడంతోపాటు అన్ని బ్యాంకుల ఖాతాలను కూడా సీజ్ చేశామన్నారు. ప్రయాణంలో ఉన్నప్పుడు గురితప్పే అవకాశం ఉంటుందని, ఈకారణంగానే దుండగులు అనురాధ దంపతులను హత్యచేయడానికి కార్యాలయాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోందని ఎస్‌పి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ముఖ్యంగా మేయర్ దంపతులు భద్రతలేని గదిలో ఉండడాన్ని మున్సిపల్ కార్యాలయంలో ఎవరో హంతకులకు ఎవరో సమాచారం ఇచ్చారనే విషయంగా కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో హత్య చేసిన అనంతరం చింటూ, వెంకటేష్ తమ స్నేహితుడు యోగి దగ్గర నుంచి తీసుకువచ్చిన నలుపు రంగు టి ఎన్ 023 ఎహెచ్ 9669నెంబరు గల షిప్ట్ కారులో పారిపోయారన్నారు. దాడికి నిందితులు 3.2పిస్టల్‌తోపాటు ఒక ఎయిర్ పిస్టల్‌ను కూడా వినియోగించారన్నారు. ఇదిలాఉండగా హంతకులు ఉపయోగించిన యమహా మోటార్ సైకిల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిత్రం.. చిత్తూరు జిల్లాకేంద్రంలో తన బంగ్లాలో విలేఖర్లతో
మాట్లాడుతున్న ఎస్పీ శ్రీనివాస్