తెలంగాణ

భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 20: వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 21న (నేడు) జరిగే పోలింగ్ కోసం యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో జరిగే పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అందుకోసం 20 కంపెనీల భద్రతా దళాలు మోహరించారు. ఈ నెల 21న జరిగే వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో 15.09,671 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో 7.57,231 మంది పురుషులు ఉండగా, 7.52,293 స్ర్తిలు, 147 ఇతరులు ఓటర్లు ఉన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, భూపాలపల్లి ఏడు నియోజకవర్గాల్లో జరుగనున్న వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక కోసం 1778 పోలింగ్ స్టేషన్లను ఏర్పాట్లు చేశారు. 2400 సియు, 4800 బియు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు గాను 1974 మంది పిఓలు, 2008 మంది ఏపిఓలు విధులు నిర్వహించనున్నారు. వీరితో పాటు పోలింగ్ ప్రక్రియను పరిశీలించుటకు 738 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలోని పోలింగ్ స్టేషన్లకు ఇవియంలు, కంట్రోల్ యూనిట్‌లు, బ్యాలెట్ యూనిట్స్ ఎన్నికల సామాగ్రిని ఒక రోజు ముందే ఆయా నియోజకవర్గాలలో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ స్టేషన్లకు తరలించారు. నియోజకవర్గంలోని 1778 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎక్కడ కూడా అసౌకర్యం కలుగకుండా కనీస అవసరాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సౌకర్యం బారికేడింగ్, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాట్లు సమకూర్చారు. వరంగల్ నగరంలో 30 ఓటరు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు నియోజకవర్గం పరిధిలోని 1778 కేంద్రాలలో 819 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా, 393 సమస్యాత్మకంగా, 566 సాధారణ కేంద్రాలుగా గుర్తించి వాటికి అనుగుణంగా భద్రత ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేశారు. పోలింగ్ ప్రక్రియ సరళిని పరిశీలించేందుకు పోలింగ్ కేంద్రాలలో వీడియో గ్రాఫర్లను నియమించారు. అదే విధంగా నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు జరిగే రోజున దుకాణాలు సంస్థలలో పని చేయు కార్మికులకు సెలవుదినంగా ప్రకటించారు. పోలింగ్ ముగిసిన అనంతరం వరంగల్‌లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఇవిఎంలను తరలించి భద్రపర్చడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఏనుమాముల మార్కెట్‌లో ఉదయం 8 గంటల నుండి కౌటింగ్ మొదలవుతుంది.