ఆంధ్రప్రదేశ్‌

రాజధాని డిజైన్లు మారుతున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2: రాజధాని అమరావతిని నిర్మించే సంస్థను ఖరారు చేసేపనిలో రాష్ట్ర ప్రభుత్వం బిజీ అయింది. అత్యుత్తమ ఆర్కిటెక్ట్‌ను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకూ రాజధాని అమరావతికోసం చేసిన పని అంతా ఒక ఎత్తు, ఇకముందు జరిగేది మరో ఎత్తు అని అన్నారు. అత్యుత్తమ రాజధానిని నిర్మించేందుకు ప్రపంచం మెచ్చే డిజైన్లను తయారుచేసే ఆర్కిటెక్ట్‌లను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యామని చెప్పారు. ఈ డిజైన్లను జ్యూరీ ఎంపిక చేస్తుందన్నారు.
రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయాలకు సంబంధించి ఆకృతిలో మార్పులు చేసి తుదిరూపు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సోమవారం తన నివాసం నుంచి క్యాపిటల్ సిటీ ఆర్కిటెక్చర్ అడ్వైజరీ కమిటీతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో వౌళిక సదుపాయాల కల్పనకు సంబంధించి విభాగాల వారీగా నిపుణులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వక్ఫ్ బోర్డు రికార్డుల కంప్యూటరీకరణకు కమిటీ
వక్ఫ్‌బోర్డు రికార్డుల కంప్యూటరీకరణకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి చైర్మన్‌గా మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కన్వీనర్‌గా వక్ఫ్‌బోర్డు సిఇఓ, సభ్యులుగా ఆర్థిక, రెవెన్యూ, న్యాయశాఖల డిప్యూటీ సెక్రటరీలు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఇద్దరు, ఐటి శాఖ నుంచి ఒకరు, ఎన్‌ఐసి నుంచి ఒకరిని నియమిస్తూ జివో జారీ చేసింది.

బెంగళూరులో మహిళ కిడ్నాప్
బెంగళూరు, మే 2: ఈశాన్య బెంగళూరులో 22ఏళ్ల యువతిని పట్టపగలే అపహరించుకుపోయిన ఘటన విస్మయానికి గురిచేసింది. ఆమెను అపహరించుకుపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజిలో రికార్డు అయ్యాయి. పేయింగ్ గెస్ట్ హాస్టల్ ముందు ఫోన్‌లో మాట్లాడుతున్న యువతిని వెనుకనుంచి వచ్చిన ఓ వ్యక్తి చేతులతో ఎత్తుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకువెళ్లాడు. కొద్దిసేపటి తరువాత ఆమెను వదిలేసి అతను పారిపోయాడు. జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నేను ఫోన్ మాట్లాడుతుండగా అతను వెనుకనుంచి వచ్చి పట్టుకున్నాడు.. నేను గట్టిగా అరవటంతో నా నోరు మూశాడు.. నన్ను నేను కాపాడుకోవటానికి ప్రయత్నించినప్పుడు గట్టిగా కొట్టడంతో భయంతో స్పృహ కోల్పోయాను. కొద్దిసేపటి తరువాత లేచి చూసేసరికి నా బ్యాగ్, మొబైల్ అక్కడే ఉన్నాయి. అతను లేడు. వీటిని బట్టి చూస్తే నాపై లైంగిక దాడికి పాల్పడటమే అతని ఉద్దేశం కావచ్చు’ అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్‌ను పట్టుకోవటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మిషన్ కాకతీయ కోసం

భారీగా ఇంజనీర్ల బదిలీలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 2: మిషన్ కాకతీయ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు పెద్ద సంఖ్యలో నీటిపారుదల శాఖలో సిబ్బందిని డిప్యూటేషన్‌పై అవసరమైన ప్రాంతాలకు బదిలీ చేశారు. మిషన్ కాకతీయ పనులు కొన్ని జిల్లాల్లో నత్తనడకన నడుస్తుండడంతో ఆయా జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి అధికారులను డిప్యూటేషన్‌పై పంపించారు. నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశాలతో ఇరిగేషన్ అడ్మిన్ ఇఎన్‌సి విజయప్రకాశ్, ఒఎస్‌డి శ్రీ్ధర్‌రావు దేశ్ పాండే ఈ మేరకు కసరత్తు చేశారు. ఏయే సర్కిల్స్‌లో అదనపు సిబ్బంది ఉన్నారో పరిశీలించి ఆ సిబ్బందిని నాలుగు నెలల డిప్యూటేషన్‌పై అవసరం అయిన ప్రాంతానికి పంపించారు. కరీంనగర్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పని చేస్తున్న వారిలో 55 మంది సిబ్బందిని మిషన్ కాకతీయకు బదిలీ చేశారు.
కరీంనగర్‌కు చెందిన ఇద్దరు డిఇఇలను 16 మంది ఏఇఇలను బదిలీ చేశారు. వరంగల్‌కు ముగ్గురు డిఇఇలు, 24 మంది ఎఇఇలను బదిలీ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్‌లకు పది మంది ఎఇఇలను డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సమీక్ష సందర్భంగా హరీశ్‌రావు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయను మరింత వేగంగా పూర్తి చేయాలని ఆయన ఇరిగేషన్ ఇంజనీరింగ్ యంత్రాంగాన్ని ఆదేశించారు. మిషన్ కాకతీయ పనులు పూర్తి కావడానికి సిబ్బంది కొరత ఉందని పలు సార్లు వీడియో కాన్ఫరెన్స్‌లలో సమీక్షా సమావేశంలో ఎస్‌ఇలు, సిఇలు చెబుతున్నందున అదనపు సిబ్బందిని డిప్యూటేషన్‌పై బదిలీ చేయాలని మంత్రి ఆదేశించారు. అదే విధంగా ఇతర జిల్లాల్లోని అదనపు సిబ్బందిని సైతం డిప్యూటేషన్‌పై మిషన్ కాకతీయకు ఉపయోగించుకోనున్నారు. మిషన్ కాకతీయ పథకం అమలును ఆ సంస్థ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం సమీక్షించారు. జూన్ 30 నాటికి నిజామాబాద్ జిల్లాలోని 121 గ్రామాలకు మంచినీటిని అందించనున్నట్టు చెప్పారు. ఈసారి వర్షాలు బాగా కురుస్తాయనే సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ భూముల్లో ముందుగానే పైప్‌లైన్ పనులు పూర్తి చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పనులతో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో మిషన్ భగీరథ పనులను ఇఎన్‌సి బి సురేందర్‌రెడ్డి సమీక్షించారు.