రాష్ట్రీయం

గొడవలొద్దంటే కెసిఆర్‌కు కోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 5: కృష్ణాజలాలపై ఇప్పటివరకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సమస్యలు ఎదురవగా తాజాగా తెలంగాణ నుంచి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కృష్ణానదిపై తెలంగాణ చేపడుతున్న కొత్త ప్రాజెక్టుల వల్ల ఆంధ్రరాష్ట్ర రైతులకు నీరందకపోయే ప్రమాదం ఉందన్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం సింగవరం గ్రామంలో నీరు-చెట్టు, ఎన్టీఆర్ జలసిరి, పంట సంజీవని కార్యక్రమాల కింద చేపట్టిన పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం పరిశీలించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ నదీజలాల విషయంలో సమష్టి నిర్ణయం తీసుకోవాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కష్టాలు వస్తాయని, గొడవ పడితే ఎవరికీ లాభం ఉండదని తాను చెబుతున్నానని, కానీ తన మాటలకు ఆ ముఖ్యమంత్రికి కోపం వస్తోందని వ్యాఖ్యానించారు. మరోపక్క రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు. పోలవరం, పట్టిసీమ, భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి అడ్డంకులు కలిగించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఇటీవలికాలంలో జరుగుతున్న ప్రచారంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రత్యేక హోదా వస్తుందా.. లేదా, రాష్ట్రానికి నిధులు ఇస్తారా.. లేదా అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయన్నారు. ఈరోజు కూడా తాను కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడుతో మాట్లాడానని, ప్రజల అనుమానాలు, ఆందోళనను వారి దృష్టికి తీసుకువచ్చానన్నారు. విభజన చట్టం అమలులో భాగంగా రాష్ట్రానికి ఏమిస్తారు, ఏం చేస్తారు అనేది స్పష్టం చేయాలని కేంద్రమంత్రులను కోరానని అన్నారు. విభజన నేపధ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆశించిన సహాయం అందటం లేదన్నారు. ఈమాట ప్రజలకు చెప్పి తాను తప్పించుకోవచ్చని, కానీ రాష్ట్ర సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నుంచి ఎక్కువ సహాయం కోసం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏమీ చెప్పలేదని, పోలవరం ప్రాజెక్టు విషయంలో న్యాయం చేస్తామని తెలిపారని అన్నారు. విభజన సందర్భంలో కాంగ్రెస్ పార్టీతో లాలూచీ పడిన కారణంగానే జైలులో ఉండవలసిన జగన్ బయటకు వచ్చాడని, ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులు, సిబిఐ కేసులు ఉన్న కారణంగా జగన్‌కే లాలూచీ పడవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

chitram విజయనగరం జిల్లా సింగవరం గ్రామంలో గురువారం జరిగిన సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు నాయుడు