రాష్ట్రీయం

వైద్య శాఖ విభజనపై రేపు ఇరు రాష్ట్రాల సిఎస్‌ల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపుపై ఈ నెల 7వ తేదీన రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశమవుతున్నారు. వైద్య శాఖ విభజనలో తలెత్తిన సమస్యలను ఈ సమావేశంలో పరిష్కరించనున్నారు. కేంద్ర పర్సనల్ అండ్ ట్రైనింగ్ కార్యదర్శి సంజయ్ కొఠారి ఆదేశం మేరకు ఈ సమావేశం జరుగుతోంది. వైద్య శాఖలో పనిచేస్తున్న వైద్యుల స్థానికతపై జరుగుతున్న కసరత్తు ఒక కొలిక్కి రాలేదు. ఈ సమస్యను కమల్‌నాథన్ కమిటీ ఆధ్వర్యంలో పరిష్కరించాలని కేంద్రం ఆదేశించింది. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆంధ్ర విభాగంలో 89 మంది డాక్టర్లు, తెలంగాణలో 54మంది డాక్టర్లు విధి నిర్వహణలో లేరని వైద్య శాఖ ఇప్పటికే నిర్ధారించింది. విధులకు గైర్హాజరైన డాక్టర్లకు ఇప్పటికే ఆంధ్ర వైద్య శాఖ టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 153 శాఖల్లో 117 శాఖల ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు విభజిస్తూ కమల్ నాథన్ కమిటీ ఇప్పటికే కేంద్రానికి నివేదిక ఇవ్వగా ఆమోదం లభించింది. హోం, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, పబ్లిక్ హెల్త్, వైద్య విద్య, ఆరోగ్య శాఖ డైరెక్టరేట్, డిజిపి ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఉద్యోగుల పంపకం పూర్తి కాలేదు. హైదరాబాద్ హైకోర్టు ఇటీవలనే న్యాయాధికారుల పంపకం కసరత్తు పూర్తి చేసింది. వచ్చే సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు, పోలీసు డిఎస్పీల పంపకాల పనిని పూర్తి చేయనున్నారు.