రాష్ట్రీయం

మలుపు తిరిగిన దేవి మృతి కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5: ఇంజనీరింగ్ విద్యార్థిని కట్కూరి దేవిరెడ్డి మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విద్యార్థిని దేవి కారు ప్రమాదంలో చనిపోలేదని, హత్య చేశారని మృతురాలి కుటుంబీకులు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నానక్‌రాంగూడలో ఒక హోటల్ ప్రారంభ కార్యక్రమానికి శనివారం సాయంత్రం బయలుదేరిన దేవిరెడ్డి ఆదివారం తెల్లవారుజామున జర్నలిస్టు కాలనీ సమీపంలోని హుడా ఎన్‌క్లేవ్ వద్ద కారు చెట్టుకు ఢీకొన్న ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దేవి మృతి చెందగా కారు నడుపుతున్న ఆమె స్నేహితుడు భరతసింహారెడ్డి క్షేమంగా బయటపడ్డాడు. తొలుత ప్రమాదమని భావించి అంత్యక్రియలు జరిపిన కుటుంబీకులు అనంతరం ఆమె మరణంపై అనుమానాలున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు వెస్ట్‌జోన్ డిసిపి వెంకటేశ్వరరావు సంఘటన స్థలాన్ని సందర్శించగా మృతురాలు దేవి బంధువులు ఆయనను ఘెరావ్ చేశారు. దేవి తండ్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తన కూతురు ప్రమాదంలో చనిపోలేదని, హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపించారు. మళ్లీ మొదటికొచ్చిన ఈ కేసులో డిసిపి వెంకటేశ్వరరావు దేవి స్నేహితుడు భరతసింహారెడ్డితోపాటు ఆమె స్నేహితులను విచారిస్తున్నారు.
దేవిని హత్య చేయాల్సిన అవసరం లేదు: భరతసింహారెడ్డి
తన స్నేహితురాలు దేవిని హత్య చేయాల్సిన అవసరం తనకు లేదని ఆమె స్నేహితుడు భరతసింహారెడ్డి స్పష్టం చేశారు. అదుపు తప్పి కారు చెట్టుకు ఢీకొనడంతో ఆమె గాయపడిందని, అపోలో ఆసుపత్రికి తరలించగా మృతి చెందిందన్నారు. కావాలని తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు.
నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం: డిసిపి
దేవిరెడ్డి మృతిపై నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని వెస్ట్‌జోన్ డిసిపి వెంకటేశ్వరరావు చెప్పారు. దేవి మృతి కేసులో పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారనడాన్ని ఆయన ఖండించారు. అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుపుతున్నామని, మిస్టరీగా మారిన దేవి మృతి కేసును త్వరలో ఛేదిస్తామన్నారు. దేవి మృతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న భరతసింహారెడ్డితో పాటు ఆమె స్నేహితులందరినీ విచారిస్తున్నామని డిసిపి వివరించారు.