రాష్ట్రీయం

సిన్హా సిఫార్సులను అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 5: భారతదేశంలో 22 రాష్ట్రాలు మరో రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించిన బ్రాహ్మణ సమాఖ్య సర్వేజనా సుఖినోభవంతు... నినాదంతో ఎలాంటి కుల, మతపరమైన రిజర్వేషన్లు లేని అగ్రవర్ణాల్లోని పేదల సంక్షేమం, అభ్యున్నతి కోసం నడుం కట్టింది. ఇందుకోసం యుపిఎ ప్రభుత్వ హయాంలో నియమితులై 2010లోనే నివేదిక అందించిన ఎస్‌ఎన్ సిన్హా కమిషన్ నివేదిక సిఫార్సులను తుచ తప్పక అమలు చేయించేందుకు ఈ దేశంలో తొలుతగా బ్రాహ్మణ సమాఖ్య నడుం కట్టింది. గతంలో మార్మోగిన గరీబో హఠావో నినాదాన్ని తలదనే్నలా ఎలాంటి రిజర్వేషన్‌లకు నోచుకోని అగ్రవర్ణాల్లోని పేదలకు సంక్షేమం కోసం బ్రాహ్మణ సమాఖ్య నడుం కట్టింది. 1984లో తణుకుకు చెందిన దివంగత ప్రముఖ న్యాయవాది బిఎస్‌ఆర్ ఆంజనేయులు స్థాపించిన ఈ సమాఖ్య క్రమేపి ఓవైపు బ్రాహ్మణ శ్రేయస్సును పెంచుతూ సామాజిక దురాచారాలను అంతరింపచేసే లక్ష్యంతోనూ మతసామరస్యం సామాజిక సమానత్వం సాధిస్తూ తద్వారా మానవాళి శ్రేయస్సు పెంచడానికి కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఈనెల 22న ఉదయం విజయవాడలో సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశం జరుగబోతోంది. దీనికి దేశం నలుమూలల నుంచి కనీసం 500 మందికి పైగా ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సమాఖ్య జాతీయ సలహాదారు కోట శంకరశర్మ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎలాంటి మత, కులపరమైన రిజర్వేషన్లు లేని అగ్రవర్ణాల్లోని పేదల సంక్షేమం కోసం యుపిఎ ప్రభుత్వం నియమించిన కమిషన్ అనేక సిఫార్సులను చేసిందన్నారు. అయితే నేటి వరకు నాటి యుపిఎ గాని, నేటి ఎన్‌డిఎ ప్రభుత్వం గాని ఆ సిఫార్సులను తిరస్కరించటం గాని ఆమోదించడం గాని చేయకుండా పెండింగ్‌లో ఉంచడం బాధాకరమన్నారు.
ఈ దేశంలో ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా దాదాపు ఆరుకోట్ల మంది పేదరికం అనుభవిస్తున్నారన్నారు. వీరిలో 28 శాతం మంది నిరక్షరాస్యతతో.. అలాగే ఎలాంటి నైపుణ్యం లేకుండా అనారోగ్యంతో కనీస వైద్య సహాయానికి నోచుకోక బాధలు పడుతున్నారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నాటి సిన్హా ప్రతి కటుంబానికి కనీసం 10వేలు సహాయం చొప్పున రూ.10కోట్లతో ప్యాకేజి ప్రకటించాలని సిఫార్సు చేసినా అతీగతీ లేదన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేర్చామన్నారు. ప్రణాళికా బోర్డు పరిధిలోకి వీరిని తీసుకున్నామన్నారు. అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
అయితే తాజాగా తమ సమాఖ్య పోరాటాల ఫలితంగా రాజస్థాన్ ప్రభుత్వం అగ్రవర్ణాల్లోని పేదల విద్య, ఉపాధి, ఆరోగ్య అవసరాల కోసం 14 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును తీసుకురావటమే గాక చట్టంగా మలచిందన్నారు. అవసరమైతే రాజ్యాంగ సవరణకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. గుజరాత్‌లో పటేళ్ల ఆందోళన కారణంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 19 శాతం రిజర్వేషన్లను అగ్రవర్ణాల్లోని పేదల కోసం కల్పించాలని శంకరశర్మ డిమాండ్ చేశారు. ఈనెల 22న నగరంలో జరగబోయే జాతీయ కార్యవర్గ సమావేశం జాతీయ అధ్యక్షులు, రాజస్థాన్ మాజీ మంత్రి పండిట్ భవర్‌లాంశర్మ, ప్రధాన కార్యదర్శి కేరళకు చెందిన డాక్టర్ ప్రదీప్ జ్యోతి, పంజాబ్‌కు చెందిన కోశాధికారి చంద్రశేఖర శర్మ, తదితరులు పాల్గొననున్నారని తెలిపారు.
ఈ విలేఖరుల సమావేశంలో సమాఖ్య ఉపాధ్యక్షులు ఎంబిఎస్ శర్మ, జాతీయ కార్యదర్శి ఎంఎల్‌ఎన్ శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీకాంత్, విజయవాడ నగర అధ్యక్షుడు ప్రయాగ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.