ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో ఏపి మంత్రి రవీంద్రకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 6: రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఘోర రోడ్డు ప్రమాదం నుండి క్షేమంగా బయట పడ్డారు. గురువారం నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల పర్యటన ముగించుకుని విజయవాడ వస్తుండగా రవీంద్ర ప్రయాణిస్తున్న వాహనం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గుంటూరు జిల్లా మంగళగిరి కాజ టోల్‌గేట్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మంత్రి రవీంద్రతో పాటు టిడిపి నాయకుడు కుర్రా నరేంద్ర, డ్రైవర్ వెంకట్, అసిస్టెంట్ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్, పిఆర్‌ఓ బాషా, గన్‌మెన్ పార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి రవీంద్రను, ఇతర క్షతగాత్రులను హుటాహుటిన విజయవాడ మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్న చిన్న గాయాలు కావటంతో ఆస్పత్రి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. ఉదయం 11 గంటలకు మంత్రి తన సొంత నియోజకవర్గమైన మచిలీపట్నం చేరుకున్నారు. భగవంతుడు, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే ప్రమాదం నుండి బయట పడ్డానని మంత్రి తెలిపారు.
‘ఇఫ్లూ’లోనూ
ఒక్క నిమిషం నిబంధన
ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష
రాయలేకపోయిన 50 మంది విద్యార్థులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 6: ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (ఇఫ్లూ) నిర్వహించిన ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షల్లో సైతం ఒక్క నిమిషం నిబంధన పాటించడం వివాదాస్పదం అయింది. పరీక్ష రాయలేకపోయిన దాదాపు 50 మంది విద్యార్థులు యూనివర్శిటీ రిజిస్ట్రార్‌కు మొరపెట్టుకున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఉదయం 8.30 గంటలకే గేట్లు మూసేశారని, వాస్తవానికి పరీక్ష 9 గంటలకు ప్రారంభం కావల్సి ఉన్నా, ఒఎంఆర్ భర్తీకోసం అర గంట వ్యవధి ఉందని, వాటన్నింటినీ అధికారులు పక్కన పెట్టి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించలేదని వారు చెప్పారు. ఇఫ్లూ ధోరణిపై విద్యార్థులు మండిపడ్డారు. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా 75 శాతానికి పైగానే విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు హాజరయ్యారని, కొంత మంది కావాలనే ఆలస్యంగా వచ్చినట్టు గుర్తించామని వర్శిటీ పాలనాధికారి తెలిపారు. పరీక్ష సమయం కంటే అర గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని స్పష్టమై ఆదేశాలను అభ్యర్థులకు ఇచ్చామని ఆయన వివరించారు. ఏడో తేదీన జరిగే పిహెచ్‌డి పరీక్షలకు మాత్రం అభ్యర్థులు ఇలాంటి ఇబ్బందులు లేకుండా అర గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు.

‘డెల్టా’ రైలుకు త్రుటిలో తప్పిన ప్రమాదం

వరదనీటితో పట్టాల కింద ఏర్పడిన గొయ్యి పెను ప్రమాదాన్ని తప్పించిన రైతులు, వాచ్‌మన్

వలిగొండ, మే 6: నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలో డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్ రైలుకు వరద నీటితో కల్వర్టు దెబ్బతిన్న రూపంలో మరో సారి ప్రమాదం ఎదురైంది. అయితే ఈ దఫా స్థానిక రైతులు, రైల్వే ట్రాక్ వాచ్‌మన్ అప్రమత్తతతో రైలుకు భారీ ప్రమాదం తప్పింది. గతంలో 2005 ఆక్టోబర్ 29 తెల్లవారుజామున ఇదే మండలంలోని గొల్నెపల్లి వద్ద రైల్వే ట్రాక్ కల్వర్టు భారీ వర్షాలు, వరదతో తెగిపోయి ట్రాక్ కొట్టుకుపోవడంతో డైల్టా రైలు ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఈ దుర్ఘటనలో 114మంది మృత్యువాత పడ్డారు.
తాజాగా శుక్రవారం తెల్లవారుజామున మరోసారి అదే రైలుకు ఇదే మార్గంలోత్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. టేకుల సోమారం గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ట్రాక్ కల్వర్టు(రోడ్ అండర్ బ్రిడ్జి) శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీవర్షంతో వచ్చిన వరదతో ఇరువైపుల కోతకు గురికావడంతో పట్టాల క్రింద గొయ్యి ఏర్పడింది. తెల్లవారుజామున డెల్టా రైలు ఈ మార్గంలో వెళ్తుండగా అప్పుడే ట్రాక్‌వద్దనుండి వ్యవసాయబావుల వద్దకు వెళ్తున్న రైతులు పాక వెంకటేశం, పాక శ్రీశైలం దీనిని గమనించి ట్రాక్ వాచ్‌మన్ చేగూరి భిక్షపతికి తెలియజేశారు. వాచ్‌మన్ తన వద్ద ఉన్న ఎరుపు రంగు షర్టు ఊపుతూ రైలుకు ఎదురుగా పరుగులు తీసి రైలును ఆపించాడు. దీనితో డెల్టా రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
ఘటనపై రైలు డ్రైవర్, వాచ్‌మన్‌లు రైల్వే అధికారులకు ఫోన్‌లో తెలియజేయడంతో వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని యుద్ధప్రాతిపదికన పనులను ప్రారంభించి రెండున్నర గంటల్లోగా ట్రాక్‌ను పునరుద్ధరించారు. ట్రాక్ మరమ్మతు కారణంగా ఉదయం 6గంటల నుండి 8-30వరకు డెల్టా రైలు సంఘటన స్థలంలో ఆగిపోగా ఈ మార్గంలో సికింద్రాబాద్ వెళ్తున్న పల్నాడ్, ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌లు కూడా కొంత ఆలస్యమైనాయి.