తెలంగాణ

నకిలీ పుస్తకాలతో రుణాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 9: నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు తీసుకుని బ్యాంక్‌ను మోసగించిన ఎనిమిది మందిపై మహ బూబ్‌నగర్ జిల్లా బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై ఎపిజివిబి బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై అశోక్‌కుమార్ కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. బాలానగర్ మండలం రాజాపూర్ ఎపిజివిబి బ్యాంక్ శాఖలో నకిలీ పాస్‌పుస్తకాలను ఉంచి పెద్దాయపల్లి గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి, దాచని మహిపాల్‌రెడ్డి, మహేష్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సుగుణమ్మ, కోదండరాంరెడ్డి (బాలానగర్ మాజీ ఎంపిపి) పేర్లతో 5.25 లక్షల రూపాయలను రుణాలుగా తీసుకున్నారు. బాలానగర్ ఎపిజివిబి శాఖలో పెద్దాయపల్లి గ్రామానికి చెందిన నాగార్జున, శంకర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, సుగుణమ్మ పేర్లతో 4.39 లక్షల రూపాయలు రుణాలు తీసుకున్నారు. అయితే బ్యాంకుల్లో పెట్టిన పాస్‌పుస్తకాలు నకిలీవిగా గుర్తించిన బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్ నంబర్ 323/2015లో సెక్షన్లు 420, 468, 471లలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్‌కుమార్ తెలిపారు.

ప్రెషర్ బాంబు పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు
భద్రాచలం, డిసెంబర్ 9: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా అరణ్‌పూర్-జేగురుగొండ గ్రామాల మధ్య నూతనంగా నిర్మిస్తున్న రహదారిలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన ప్రెషర్ బాంబు పేలి బుధవారం ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. రహదారి నిర్మాణ పనులకు బందోబస్తుకు వెళ్లిన వీరు ప్రెషర్‌బాంబుపై కాలు వేయడంతో అది పేలింది. ఈ ఘటనలో ఏఎస్సై సంతోష్‌ఠాకూర్, కానిస్టేబుల్ లాల్‌సింగ్‌నేతమ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని దంతెవాడ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహిస్తున్నారు. మరోవైపు గాదిరాజ్ పోలీసుస్టేషన్‌కు 8కి.మీ దూరంలో కోర్రామ్ అనే గ్రామం వద్ద సీఆర్‌పీఎఫ్ 230 బెటాలియన్ బి కంపెనీకి చెందిన జవాన్లు 25 కిలోల మందుపాతర్లను రెండింటిని గుర్తించారు. వెంటనే బాంబు స్వ్కాడ్‌ను పిలిపించి ఆ రెండు మందుపాతర్లను నిర్వీర్యం చేశారు. రాజ్‌నంద్‌గావ్ జిల్లా మాన్‌పూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని సీతాగావ్- ఔంది రహదారి మార్గంలో హలాంజూర్ గ్రామంలో 5 కిలోల మందుపాతరను పోలీసు బలగాలు గుర్తించి నీర్వర్యం చేశాయి. కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు బ్యానర్లు, కరపత్రాలు వదిలారు. లొంగిన మావోయిస్టులను హతమారుస్తామని వారు అందులో పేర్కొనడం గమనార్హం.