తెలంగాణ

మావోయిస్టులు వదిలిన వెళ్లిన బేనర్లు ఆకర్ష్‌కు ఆద్యులు మీరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, డిసెంబర్ 9: పార్టీల వలసల ఆపరేషన్ ఆకర్ష్‌కు ఆద్యులు మీరేనని, టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఆకర్ష్ వంటి అప్రజాస్వామిక పనులు తెలియవని కాంగ్రెస్ నాయకులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధి తేరా చిన్నపరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నల్లగొండలో ఏచూరి గార్డెన్స్‌లో పార్టీ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 17 నెలలే అయ్యిందని, గత 20 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తమ ప్రభుత్వం ద్వారా సాధ్యమవుతుందన్నారు. అందుకే విపక్షాల నుండి ప్రజాప్రతినిధులు, నాయకులు టిఆర్‌ఎస్‌లో స్వచ్ఛందంగా చేరుతున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆకర్ష్‌తో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను, ఎంపిలను, ప్రజాప్రతినిధులను పార్టీ లో చేర్చుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో ఓ పార్టీ పెద్ద మనిషి ఆకర్ష్ గురించి మాట్లాడటం సిగ్గు చేటని, అతని ఆకర్ష్ గురించి తర్వాత చెబుతానన్నారు. నల్లగొండ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి 2014 ఎన్నికల్లో అత్యధికంగా ఖర్చు పెట్టి గెలిచాడన్నారు. నేడు టిఆర్‌ఎస్ వైపు 650మంది స్థానిక సంస్థల ఓటర్లు ఉన్నారని, త్వరలో 700లకు చేరుతుందన్నారు. త్వరలో నాగార్జునసాగర్, కోదాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టిడిపి దుకాణాలు ఖాళీ అవుతాయన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌కు అన్నివిధాలుగా బలం ఉందని, ఎవరినీ ప్రలోభపెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే నాయకులు పార్టీలో చేరుతున్నారని, నాపై నమ్మకంతో కెసిఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని, తప్పకుండా గెలిచి తీరుతానన్నారు.

నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి