ఆంధ్రప్రదేశ్‌

మోదకొండమ్మ జాతర ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, మే 8: విశాఖ జిల్లా పాడేరులో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మోదకొండమ్మ ఉత్సవాలను ఈసారి రాష్ట్ర వేడుకగా ప్రభుత్వం ప్రకటించి ఇందుకోసం 50 లక్షల రూపాయలు విడుదల చేయడంతో ఈ ఉత్సవాలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అమ్మవారి జాతర నిర్వహణపై ఉత్సవ కమిటీతో పాటు అధికార యంత్రాంగం కూడా దృష్టి సారించడంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఐటిడిఎ పిఒ ఎం.హరినారాయణన్, సబ్ కలెక్టర్ ఎల్.శివశంకర్, జివిఎంసి విసి టి.బాబురావునాయుడు మోదకొండమ్మ జాతరను సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. అమ్మవారి ఆలయం నుంచి మోదకొండమ్మ ఉత్సవ విగ్రహం, ఘటాలు, పాదాలను వీరు తమ శిరస్సులపై ఉంచుకుని భారీ ఊరేగింపు ద్వారా సతకంపట్టులో ప్రతిష్ఠించడం ద్వారా ఉత్సవాలకు నాంది పలికారు. మంగళవారం వరకు నిర్వహించే మోదకొండమ్మ జాతరలో రోజూ సాయంత్రం పాడేరు పట్టణ పురవీధుల్లో అమ్మవారి ఘటాలను ఊరేగించి భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తారు. ఈ నెల 10న అమ్మవారి ఘటాలు, పాదాలు, ఉత్సవ విగ్రహాన్ని సతకంపట్టు నుంచి మళ్లీ ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారి ఆలయంలో యథాస్థానంలో ప్రతిష్ఠించడం ద్వారా ఉత్సవాలు ముగుస్తాయి. జాతరను పురస్కరించుకుని ప్రభుత్వం తొలిసారిగా గిరిజన ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలోని గిరిజన సంస్కృతి సంప్రదాయాలపై పలు ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. గిరిజన ఉత్సవాన్ని రాష్ట్ర గిరిజన మంత్రి రావెల కిషోర్‌బాబు ఆదివారం సాయంత్రం లాఛనంగా ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పోటీ పడడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఇదిలా ఉండగా మన్యంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా జాతరకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మోదకొండమ్మ జాతరలో ఘటాలను ఊరేగిస్తున్న భక్తులు