ఆంధ్రప్రదేశ్‌

22న షార్ నుంచి ఆర్‌ఎల్‌వి-టిడి రాకెట్ ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 8: ఇటీవల కాలంలో అగ్రరాజ్యాలకు దీటుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్తదనంతో కూడిన వినూత్న రకాల ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల సొంత జిపిఎస్ వ్యవస్థకు ఏడు ప్రయోగాలను విజయవంతంగా చేపట్టి ఎన్నో యేళ్ల కళల సాకారాన్ని నిజం చేస్తూ సొంతంగా నావిగేషన్ వ్యవస్థను మన శాస్తవ్రేత్తలు రూపొందించారు. ఇదే తరహాలో ఇస్రో పునఃప్రవేశ ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు. ఇందుకు కూడా షార్ కేంద్రమే వేదిక కానుంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం ఈ నెల 22న ఆర్‌ఎల్‌వి-టిడి పునర్వినియోగ వాహక నౌక ప్రయోగం జరగనుంది. మొత్తం 1.7టన్నుల బరువుగల ఈ రాకెట్‌ను తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో (విఎస్‌ఎస్‌సి) మన శాస్తవ్రేత్తలు సొంతంగా రూపకల్పన చేశారు. అనంతరం అక్కడ నుండి బెంగళూరు ఉపగ్రహ తయారీ కేంద్రంలో రాకెట్‌కు పలు పరీక్షలు సైతం విజయవంతంగా నిర్వహించారు. 2012లోనే ఈ ప్రయోగానికి అనుమతి లభించింది. అనంతరం ఎల్‌ఎంవికేర్ మిషన్ అనే పునర్వినియోగ రాకెట్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అనంతరం బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రయోగం ఆలస్యం జరిగింది. ఈ నెల 22న ప్రయోగించేందుకు షార్‌లో అన్ని ఏర్పాట్లను శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఇలాంటి ప్రయోగాలు వల్ల ఒక రాకెట్‌లో ఉపయోగించిన పరికరాలు వృథా కాకుండా మళ్లీ వాటిని తెచ్చుకొని మరో ప్రయోగాల్లో ఉపయోగించుకోవచ్చును. దీని వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా సమయం కూడా ఆదా అవ్వడంతో మరిన్ని ప్రయోగాలు జరిపేందుకు వీలుటుంది. గతంలో రాకెట్ ప్రయోగం జరిగిన తరువాత వాటి పరికరాలను సముద్రంలో తోసేసేవారు. అలా కాకుండా ఆ పరికరాలను తిరిగి తెచ్చుకొనే విధంగా ఇస్రో వాహక నౌకలను రూప కల్పన చేస్తోంది. ఆర్‌ఎల్‌వి-టిడి రాకెట్‌ను భూమి 70కిలో మీటర్ల ఎత్తుకు పంపించి తిరిగి భూమిపైకి తీసుకొస్తారు. రాకెట్ భూమి నుండి నింగిలోకి ఎగిరినంతరం 70కి.మీ పూర్తిచేసుకోగానే బంగాళాఖాతంలో రాకెట్ పడే విధంగా రూప కల్పన చేశారు. రాకెట్ పడే కొంతదూరంలో ముందుగానే ఇస్రో సముద్రంలో ఒక నౌకను సిద్ధంగా ఉంచుతారు. రాకెట్ సముద్రంలో పడిన వెంటనే అక్కడ నుండి మళ్లీ తీసుకొస్తారు. అందువల్లే దీనిని పునర్వినియోగ వాహక నౌకగా ఇస్రో నామకరణం చేసింది. నూతన సాంకేతికతను తెలుసుకొనేందుకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపడుతోంది.

ప్రయోగానికి సిద్ధమవుతున్న ఆర్‌ఎల్‌వి-టిడి రాకెట్