ఆంధ్రప్రదేశ్‌

ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 8: ఉపాధ్యాయులు హుందాగా ఉండే దుస్తులు ధరించాలని ప్రభుత్వం సూచించింది. అలాగే తరగతి గదుల్లో సెల్‌ఫోన్ల వాడకాన్ని నిషేధించింది. ఈమేరకు ఏఏ నిబంధనలు అమలుచేయాలో సూచిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇవి అమల్లోకి రానున్నాయి. పూర్వం పంచెకట్టు, మెడలో కండువాతో ఉపాధ్యాయులు ఎంతో హుందాగా కనిపించేవారు. నేటి ఉపాధ్యాయుల వస్తధ్రారణ విద్యార్థులను ప్రభావితం చేస్తోంది. అనేక విషయాల్లో విద్యార్థులు తమ గురువులను ఆదర్శంగా తీసుకుంటారు. టీ షర్టులు, జీన్స్ ఫ్యాంట్లు వేసుకొని పాఠశాలకు రావడం వల్ల ఇబ్బంది వస్తుందని భావించిన ప్రభుత్వం గురువుల వస్తధ్రారణ విషయంలో ఓ నిర్ణయం తీసుకుని 2013 ఆర్‌సి నెంబరు 138తో ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఈ ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల పలు పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల వస్తధ్రారణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు జీన్స్ ఫ్యాంట్లు, టీ షర్టులు ధరించి పాఠశాలకు హాజరుకావడాన్ని గమనించిన ఆయన, వృత్తికి గౌరవాన్ని ఆపాదించే దుస్తులు ధరించాలని సూచించారు. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకురావడంతో ఆమె ఉత్తర్వులు జారీ చేశారు. జీన్స్ ఫ్యాంట్లు, టీ షర్టులతో పాఠశాల విధులకు హాజరుకారాదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ధరించకూడని దుస్తులు ఇవి
ఉపాధ్యాయులు 8, 6, 4 పాకెట్లు ఉండే ఫ్యాంట్లు ధరించరాదు. షర్టుకు బదులుగా టీ షర్టులు ధరించరాదు. రౌండ్ నెక్ షర్టులు ధరించకూడదు. ప్లిష్, ప్లాష్ బూట్లు ధరించి పాఠశాలలకు రాకూడదు. ఉపాధ్యాయినులకు వస్తధ్రారణ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. స్ర్తి, పురుష ఉపాధ్యాయులు ధరించే దుస్తులు వారి వృత్తి గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ఉండాలని మాత్రమే పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ వృత్తికి తగిన దుస్తులను ధరించాలని సూచించారు.