ఆంధ్రప్రదేశ్‌

పార్టీ ఫిరాయింపు చట్టం ప్రత్యేకంగా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 8: రాష్ట్రంలో ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి మారితే వారిని అనర్హులను చేసే చట్టం అం టూ ఏదీ ప్రత్యేకంగా లేదని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన సతీసమేతంగా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుడ్ని అనర్హుడిగా చేసి ఆయా ని యోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానికి లేదని సుస్పష్టం చేసారు. దీనిపై పూర్తిగా సర్వాధికారాలు స్వీకర్‌కే ఉంటాయన్నారు. స్పీకర్ ఆదేశాల మేరకే ఆయా నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఒకవేళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే రాజీనామా చేస్తే మాత్రం ఎన్నికలు నిర్వహించే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. అయితే ఫిరాయింపులు అధికమవుతాయి కదా అన్నదానికి అది వారిష్టమని, ఒక పార్టీనుంచి వేరే పార్టీలోకి మారాలా వద్ద అన్నది పూర్తిగా అ భ్యర్థి స్వతంత్ర నిర్ణయమన్నారు. ఒక పర్యాయం అభ్యర్థి ఎన్నికైన తరువాత తాను ఏ పార్టీ గుర్తునుంచి గెలిచారు అన్నది తమకు సంబంధం లే దన్నారు. స్పీకర్ అనర్హుడిగా ప్రకటిస్తే ఎన్నికలు నిర్వహించే వీలుంటుందని, రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించకుం డా ఉన్న మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల ఎన్నికలు ఎపుడు నిర్వహిస్తారన్నదానికి తమకు ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎన్నికలకు సిద్ధమవుతామని చెప్పారు.