తెలంగాణ

కృష్ణా జలాల కేటాయింపులో అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 9: కృష్ణాజలాల కేటాయింపులో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరాటం చేస్తామని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అభిప్రాయాలు తీసుకొని కృష్ణాజలాల నీటివాటాను నిర్ణయించాలని, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్టల్రే ఉండేవని, కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణకు కూడా కృష్ణాజలాల నీటి వాటా రావాలని ఈ సందర్భంగా కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. తెలంగాణకు కృష్ణాజలాల నీటివాటా రాకుండా అడ్డుకునేందుకు ఎపి సిఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో తా ము ఎంతటి పోరాటానికైనా వెనకాడేది లేదని హెచ్చరించారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణాజలాల నీటివాటాపై టిడిపి, బిజెపి నాయకులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధుల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ కేం ద్రం కూడా తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దండగ అనే భావన సృష్టించేందుకే కొందరు సీమాంధ్ర నాయకులు నీళ్లు, విద్యుత్‌పై కుట్రపన్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని ఆయన ఈ సందర్భంగా దుయ్యబట్టారు. తెలంగాణకు రావాల్సిన సీలేరు వాటర్ ప్లాంట్‌ను ఎపికి కేటాయించారని అన్నారు. తెలంగాణకు కేంద్రం మద్దతు ఏమాత్రం లేదని, ఈ విషయంలో టి.టిడిపి, బిజెపి నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నా రు. కృష్ణాజలాల కేటాయింపులో ఇప్పటికైనా కేంద్రం పునఃపరిశీలించి తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు విభజన విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభిస్తుందని అన్నారు. హైకోర్టు విభజన చేయాలని ఇప్పటికీ పలుమార్లు ప్రధానమంత్రిని కోరినప్పటికీ ఎలాంటి స్పందన లేదన్నారు. అడుగడుగునా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు టిడిపి, బిజెపి నాయకులు కుట్ర పన్నుతున్నారని, ఈ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. విలేఖరుల సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం ఎమ్మెల్సీ బరిలో ముగ్గురు

ఖమ్మం, రంగారెడ్డి ఎమ్మెల్సీ
ఎన్నికల నిలిపివేతకు హైకోర్టు నో
పిటిషన్లను కొట్టి వేసిన న్యాయస్థానం

హైదరాబాద్, డిసెంబర్ 9: స్థానిక సంస్ధల కోటాలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించనున్న ఎన్నికలను నిలిపివేయాల్సిందిగా ఆదేశించాలని దాఖలైన రెండు పిటీషన్లను హైదరాబాద్ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ నెల 27న స్థానిక సంస్ధల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాఉండగా ఖమ్మం జిల్లాకు చెందిన పి. అజయ్ కుమార్, రంగారెడ్డి జిల్లాకు చెందిన కె. మల్లేష్ ఎన్నికల నిలుపుదలకు పిటీషన్లు దాఖలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి), ఖమ్మం కార్పోరేషన్‌కు ఎన్నికలు నిర్వహించకుండా స్థానిక సంస్ధలకు ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ వ్యతిరేకమని పిటీషనర్లు తెలిపారు. పిటీషనర్ల వాదన విన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.్భస్లే, జస్టిస్ ఎస్‌వి భట్ పిటీషన్లను తోసిపుచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇది అసంబద్ధమని వారు పేర్కొన్నారు.