రాష్ట్రీయం

ఎమ్సెట్‌లో ఒసిలు తక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: తెలంగాణలో నిర్వహిస్తున్న ఎమ్సెట్‌లో 2.46 లక్షల మంది అభ్యర్థులకు హాల్‌టిక్కెట్లు జారీ చేయగా అందులో ఒసిలు 77 వేలు మాత్రమే ఉన్నారు. మిగిలిన 1.70 లక్షల మంది అభ్యర్థులు రిజర్వుడ్ వర్గాలకు చెందిన వారేనని తేలింది. మొత్తం మీద పరీక్ష రాస్తున్నా వారిలో ఇంజనీరింగ్, మెడిసిన్ రెండు స్ట్రీంలు కలిపి అమ్మాయిలు 1,20,405 మంది కాగా, అబ్బాయిలు 1,25,971 మంది ఉన్నారు. కొన్ని రిజర్వుడ్ కేటగిరిల్లో అమ్మాయిలే ఎక్కువ మంది ప్రవేశపరీక్ష రాస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో బిసిఎ అమ్మాయిలు 3112, అబ్బాయిలు 5567 మంది రాస్తున్నారు. బిసిబి అమ్మాయిలు 10,926 మంది, అబ్బాయిలు 16761 మంది, బిసి సి అమ్మాయిలు 343 మంది, అబ్బాయిలు 584 మంది, బిసి డి అమ్మాయిలు 9205 మంది, అబ్బాయిలు 14590 మంది, బిసి ఇ అమ్మాయిలు 1914 మంది, అబ్బాయిలు 6975 మంది ఉన్నారు. ఒసి అమ్మాయిలు 20626 మంది, అబ్బాయిలు 32,383 మంది రాస్తున్నారు. ఇక ఎస్సీ అమ్మాయిలు 5736, అబ్బాయిలు 8451 మంది, ఎస్టీ అమ్మాయిలు 2393, ఎస్టీ అబ్బాయిలు 4866 మంది రాస్తున్నారు. ఇక మెడిసిన్ స్ట్రీంలో బిసి ఎ అమ్మాయిలు 4711, అబ్బాయిలు 2586 మంది, బిసి బిలో అమ్మాయిలు 10626 మంది, అబ్బాయిలు 5933 మంది, బిసి సిలో అమ్మాయిలు 968, అబ్బాయిలు 365 మంది ఉన్నారు. బిసి డి లో అమ్మాయిలు 9811 మంది, అబ్బాయిలు 5878, బిసిఇలో అమ్మాయిలు 5874, అబ్బాయిలు 2590 మంది రాస్తున్నారు. ఒసి అమ్మాయిలు 16659 మంది కాగా అబ్బాయిలు 7852 మంది రాస్తున్నారు. ఎస్సీ అమ్మాయిలు 12815, అబ్బాయిలు 6673, ఎస్టీ అమ్మాయిలు 4686, ఎస్టీ అబ్బాయిలు 3917 మంది ఉన్నారు.