రాష్ట్రీయం

అమరావతి.. అభివృద్ధికి చుక్కాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 12: రాజధాని అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు సిఆర్‌డిఏ సుమారు 40 వేల కోట్ల రూపాయలతో బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది. 2020 నాటికి అమరావతికి అన్ని హంగులు కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి బ్రిటిష్ సంస్థ నుంచి రుణాన్ని తీసుకోవాలని భావిస్తోంది.
అమరావతి చుట్టూ 210 కిలోమీటర్ల పరిధిలో ఎనిమిది లేన్‌ల ఔటర్ రింగ్‌రోడ్డును 19,260 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. విజయవాడ-అమరావతి మధ్య మొదటి దశ మెట్రో లైన్ నిర్మాణాన్ని సుమారు 4,882 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే అమరావతి నగరాన్ని ఆనుకుని ఉన్న కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో సుందరీకరించి, అభివృద్ధి చేయడానికి 3,014.19 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది. అలాగే రాజధాని నగరంలో అన్ని అండర్‌గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాటిపై 306 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మించడానికి సుమారు 2,359 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని నిర్ణయించింది. రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని అరికట్టడానికి 2,214 కోట్ల రూపాయలతో ప్రణాళికను సిద్ధం చేసింది.
రాజధానిలోని వ్యర్థ జలాన్ని శుద్ధి చేయడానికి 208 ఎంఎల్‌డి ప్లాంట్‌ను సుమారు 2080 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రాజధాని అమరావతిలో 660 కిలో మీటర్ల పరిధిలో నీటి సరఫరా వ్యవస్థ రూపకల్పనకు 260 ఎంఎల్‌డి ప్లాంట్ అవసరమవుతుందని భావిస్తోంది. ఇందుకు 1,396 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది. 1203.75 కోట్ల రూపాయలతో వెయ్యి మెగావాట్ల విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు గృహాలను నిర్మించడానికి 1059 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని నిర్ణయించింది.
అదే విధంగా 140 హెక్టార్లలో ఇండస్ట్రియల్ జోన్‌ను 674.10 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. 24 కిలో మీటర్ల మేర రెండు ఆరులైన్ల ఎక్స్‌ప్రెస్ లైన్‌ను 577.80 కిలో మీటర్ల మేర నిర్మించాలని సిఆర్‌డిఏ ప్రణాళిక సిద్ధం చేసింది. 100 హెక్టార్లలో 481.50 కోట్లతో నాలెడ్జ్ సిటీ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. 250 కోట్లతో ఇంటర్నేషనల్ స్టేడియం, కనెన్షన్ సెంటర్‌ను నిర్మించడానికి రూపకల్పన చేసింది. ప్రతి రోజు 250 టన్నుల చెత్తను సేకరించి సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద శుద్ధి చేయడానికి 240 కోట్లు ఖర్చువుతుందని సిఆర్‌డిఏ పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నమూనా చిత్రం