రాష్ట్రీయం

రాజ్యసభకు రాంమాధవ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: ప్రధాని నరేంద్ర మోదీ కోటరీలో కీలక వ్యక్తిగావున్న బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయ. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాంమాధవ్ గతంలో ఆర్‌ఎస్‌ఎస్ అధికార ప్రతినిధిగా పనిచేసి, అక్కడి నుంచి పార్టీకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు కాశ్మీర్ లేదా మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు అవకాశాలు కల్పించవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయ. తర్వాత జరిగే కేంద్రమంత్రివర్గ విస్తరణలో ఆయనకు ఎంఓఎస్ హోదాలో విదేశాంగ శాఖ కట్టబెట్టవచ్చని పార్టీవర్గాల్లో ప్రచారం సాగుతోంది. నిజానికి రాంమాధవ్‌కు కేంద్రమంత్రి పదవి ఇస్తారని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.