రాష్ట్రీయం

మళ్లీ ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ విజృంభిస్తున్నాయి. గత వారం రోజుల కింద కురిసిన వర్షాలు, వాతావరణ పరిస్థితుల్లో సంభవించిన మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గి వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు మండుతున్నాయి. శుక్రవారం అనంతపురం, నందిగామ, నెల్లూరు, కర్నూల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలంగాణలో రామగుండంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా నిజామాబాద్, ఆదిలాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో శుక్రవారం వడగాల్పుల తీవ్రత పెరిగింది. ఎండలు మండిపోవడంతో ప్రజలు ఆందోళన చెందారు. రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా స్వల్పంగా మార్పు కనిపించింది. కొన్ని చోట్ల రెండు మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగడంతో రాత్రి కూడా వేడిగాలి కొనసాగింది. ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగితే, మే మొదటి వారంలో వాతావరణం చల్లబడింది. రానున్న రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.