రాష్ట్రీయం

మనకా సత్తా ఉంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి సుప్రీంకోర్టు ‘నీట్’ తప్పనిసరి చేయడంతో తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు అప్పుడే ‘నీట్’ ప్యాటర్న్‌కు సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో షాక్‌కు గురైన విద్యార్థులు, వారం రోజుల్లోనే తేరుకుని నీట్‌కు సన్నద్ధమయ్యారు. వాస్తవానికి రెండు రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా సౌకర్యాలరీత్యా ఎప్పటి నుంచో జిప్‌మర్, ఎయిమ్స్, ఎఎఫ్‌ఎంసి, సిఎంసి వంటి జాతీయస్థాయి మెడికల్ పరీక్షలకు హైస్కూల్ నుంచే శిక్షణ అందుతోంది. నీట్ పేరిట ఇపుడు జరుగుతున్న ఎఐపిఎంటి గత పదేళ్లు నుంచీ జరుగుతూనే ఉంది. దానికి సైతం తెలుగు రాష్ట్రాల్లోని నాన్‌లోకల్ విద్యార్థులు హాజరవుతూనే ఉన్నారు.
కార్పొరేట్ సంస్థలకు బొనంజా
సుప్రీం కోర్టు తీర్పు వెలువడటమే తరువాయి, ఎమ్సెట్ మెడికల్ స్ట్రీంకు ఇస్తున్న కోచింగ్‌నే ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు నీట్ కోచింగ్‌గా మార్చుకున్నాయి. తెలంగాణలో శనివారం వరకూ ఎమ్సెట్‌కు కోచింగ్ కొనసాగించిన కార్పొరేట్ జూనియర్ కాలేజీలు, సోమవారం నుంచి నీట్ శిక్షణకు క్లాసులు మొదలుపెట్టాయి. ఆంధ్ర, తెలంగాణలో ఎమ్సెట్ ముగియడంతో శిక్షణ తరగతులు సహజంగా ముగుస్తాయి. కానీ ఈసారి సుప్రీంకోర్టు తీర్పు కార్పొరేట్ కాలేజీలకు వరంగా పరిణమించింది. ఎమ్సెట్ ముగిసిన తర్వాత కూడా శిక్షణ తరగతులు నీట్ పేరిట కొనసాగించే వీలుదక్కింది. ఇంతవరకూ ఎమ్సెట్‌కు శిక్షణ పొందిన వారితోపాటు ఇతర బైపిసి విద్యార్థులను సైతం ఆకర్షించి స్వల్పకాలిక శిక్షణ, రెండు నెలల శిక్షణతోపాటు దీర్ఘకాలిక శిక్షణకు తెరలేపాయి.
సిలబస్ అదే
ఉమ్మడి ఆంధ్రలోనే ఇంటర్మీడియట్ బోర్డు ఎన్‌సిఇఆర్‌టి, సిబిఎస్‌ఇకి 10 లక్షల రాయల్టీ చెల్లించి సిలబస్ హక్కులను కొనుగోలు చేసింది. రాష్ట్రంలో సిలబస్‌ను సిబిఎస్‌ఇతో సమానంగా మార్చింది. కొన్ని సబ్జెక్టుల్లో 10 శాతం వరకూ చాలా స్వల్పమైన మార్పులున్నా అదేమీ పరీక్షలకు ఆటంకం కాదని, సిబిఎస్‌ఇ సిలబస్‌తోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సిలబస్ సమానంగానే ఉందని తెలుగు అకాడమి మాజీ సంచాలకుడు ప్రొఫెసర్ కొంక యాదగిరి చెప్పారు. 2012లో తాను సంచాలకుడిగావున్న సమయంలోనే రాయల్టీ చెల్లిస్తే ఇంటర్మీడియట్ బోర్డు సబ్జెక్టు నిపుణులతో పాఠ్యగ్రంథాలను తయారు చేయించిందన్నారు.
పరీక్ష ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి
నీట్ పరీక్ష ప్యాటర్న్ అర్థం చేసుకోవడంలో మెళకువ చూపిస్తే చాలు, తెలుగు విద్యార్థులు అందరికంటే పరీక్షను బాగా ఎదుర్కోగలరని ఓ కార్పొరేట్ కాలేజీలో సీనియర్ కెమిస్ట్రీ లెక్చరర్ వేమూరి శ్రీనివాస్ కుమార్ అన్నారు. నిజానికి ఎమ్సెట్‌కు సీరియస్‌గా ప్రిపేరైన విద్యార్థి ‘నీట్’ను ఫేస్ చేయడం చాలా తేలికైన విషయమేనన్నారు. నీట్‌కు ప్రిపేర్ అయ్యేందుకు టైమ్‌లేదన్న మాట తప్ప, సబ్జెక్టు పరంగా అప్రోచ్, ప్రజంటేషన్ అంతా ఒకేలా ఉంటుందని శ్రీనివాస్ కుమార్ చెప్పారు.
పర్సంటైల్‌లో రావాలి
ఎఐపిఎంటిలో ఉన్నట్టు 50 పర్సంటైల్ నిబంధన నీట్‌లోనూ ఉంటే దానిని అధిగమించాల్సి ఉంటుందని ఓ కాలేజీలో సీనియర్ బోటనీ లెక్చరర్ ఎక్కిరాల దత్తాత్రేయ చెప్పారు. నీట్‌వల్ల మేనేజిమెంట్ సీట్లు సైతం మెరిట్‌మీద ఇచ్చే వీలుందని, ఇది విద్యార్థులకు అదనపు సదుపాయం అవుతుందన్నారు. ఫిజిక్స్‌పరంగా విద్యార్థులు పెద్ద ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏమీ లేదని నారాయణ విద్యాసంస్థలకు చెందిన సీనియర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ నరేష్ చెప్పారు.
శిక్షణ మేలు చేస్తుంది: లలిత్‌కుమార్
‘నీట్’పై శిక్షణ ఇస్తున్న సంస్థలపై గగ్గోలుపెట్టే బదులు కొత్త ప్యాటర్న్‌ను విద్యార్థులకు అలవాటు చేయడాన్ని స్వాగతించాలని ప్రవేశ పరీక్షల నిపుణుడు లలిత్‌కుమార్ వ్యాఖ్యానించారు. నీట్‌కు సిద్ధమయ్యే సత్తా మన విద్యార్థులకూ ఉందని, వచ్చే ఏడాది నుంచి దేశంలో ఉత్తమ ర్యాంకులు సాధించగలరని, ఈ ఏడాది సమయం లేకపోవడం ఒక్కటే విద్యార్థులకు పెద్ద ఇబ్బందని అభిప్రాయపడ్డారు.