రాష్ట్రీయం

కెసిఆర్, జగన్ ఇద్దరూ దొంగలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ దొంగలేనని బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మండిపడ్డారు. కరవు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా మంగళవారం బిజెపి రాష్ట్ర శాఖ ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ ప్రసంగిస్తూ కెసిఆర్, జగన్‌పై నిప్పులు చెరిగారు. సెంటిమెంట్‌ను రగిలించి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ మేరకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని, ఇందులో భాగంగానే జగన్ కర్నూలులో దీక్ష చేపట్టారని ఆయన విమర్శించారు. కూలీలకు తక్కువ పని రోజులు, తక్కువ కూలీ అందిస్తున్నదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కరవు మండలాల్లో పన్నులు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని నిజామాబాద్ నుంచి రైతు హైదరాబాద్‌కు వచ్చి ట్యాంక్‌బండ్‌పై ఉరి వేసుకుంటే మంత్రులు హేళన చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పనులు లేకపోవడంతో రైతులు కూలీలుగా మారుతున్నారని, వలస బాట పడుతున్నారని ఆయన తెలిపారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు రాబట్టేందుకు చేసే ప్రయత్నానికి తామూ సహకరిస్తామని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు.
ఎమ్మెల్యే జి. కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ ఇంతకాలం తెలంగాణ ధనిక రాష్టమ్రంటూ చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు కరవు నివారణకు, రైతుల వలసల నివారణకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ధర్నాలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో మంగళవారం పార్టీ నిర్వహించిన ధర్నాలో పాల్గొని ఎడ్లకు మేత తినిపిస్తున్న బిజెపి నేతలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి తదితరులు