రాష్ట్రీయం

కంచె ఐలయ్యపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్-గుంటూరు, మే 17: ఈ నెల 14వ తేదీన విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య హిందువుల ఆరాధ్య దైవాలు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వేదాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన అభియోగాలపై నగరానికి చెందిన న్యాయవాది కె కరుణ సాగర్ ఎల్‌బినగర్ 13వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు వచ్చే నెల 1వ తేదీలోపల కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని సరూర్ నగర్ పోలీసు స్టేషన్‌ను ఆదేశించినట్లు కరుణసాగర్ తెలిపారు.
గుంటూరులో దిష్టిబొమ్మ దగ్ధం.. ధర్నా
దేవతలు.. పురాణాలు.. హైందవ ధర్మంపై ప్రొఫెసర్ కంచె ఐలయ్య చేసిన వ్యాఖ్యలకు గుంటూరులో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఫిర్యాదు మేరకు అరండల్‌పేట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండి సమాజంలో కుల, మత, వర్గ విభేదాలకు ఐలయ్య ఆజ్యం పోస్తున్నారని బ్రాహ్మణ సమాఖ్య ఆరోపించింది. కలసి మెలసి సహజీవనం చేస్తున్న ప్రజల మధ్య ఉద్రిక్తత తలెత్తే విధంగా ఐలయ్య హిందూ ధర్మంపై వ్యాఖ్యలు చేశారని, తక్షణమే ఆయన్ను అరెస్టుచేయాలని సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. మత విశ్వాసాలతో పాటు దేవతలు.. వేదాలను సైతం కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం దారుణమని సమాఖ్య ప్రధాన కార్యదర్శి సిరిపురపు శ్రీధర్ ఇతర నేతలు తీవ్రంగా ఖండించారు. ఐలయ్యపై సెక్షన్ 295(ఎ) కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా గుంటూరులోని పాతబస్టాండ్ వద్ద గల జాలయ్య విగ్రహం వద్ద ఐలయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కులం, మతం, ప్రాంతం, భాష భేదాలు లేకుండా లౌకికభావంతో భారతీయులు మెలగుతున్న నేపథ్యంలో ఐలయ్య లాంటి వ్యక్తుల వల్ల సమాజంలో కలుషిత వాతావరణం తలెత్తుతోందని విమర్శించారు. స్వాతంత్రోద్యమంలో బ్రాహ్మణులు కీలకభూమిక వహించారని ఆస్తులు సైతం కోల్పోయారని గుర్తుచేశారు. బ్రాహ్మణుల ఆస్తులన్నీ పరాధీనమై కడుపేదరికంలో మగ్గుతూ కూలీనాలీ పనులు కూడా చేసుకుంటున్న తరుణంలో ఐలయ్య వ్యాఖ్యలు ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని ఆక్షేపించారు. వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన ఐలయ్యను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

గుంటూరులో మంగళవారం కంచె ఐలయ్య దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న దృశ్యం