రాష్ట్రీయం

10వేల సీట్లకు 2 లక్షల మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: దేశవ్యాప్తంగా ఐఐటిలు, జాతీయ సంస్థల్లో ప్రవేశానికి ఈ నెల 22వ తేదీన ఐఐటి జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. 20 ఐఐటిలు, జాతీయ సంస్థల్లో మొత్తం 9974 సీట్లు అందుబాటులోన్నాయి. ఐఐటి జెఇఇ మెయిన్స్ పరీక్ష నుండి మొత్తం 1,98,228 మంది అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుండి 12 వేల మంది పరీక్ష రాస్తున్నారు. ఇందుకోసం జెఇఇ రెండు రాష్ట్రాల్లో కలిపి ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షకు 12.07 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, అందులో 11,94,938 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేశారు. అయితే ఐఐటి జెఇఇ మెయిన్స్‌కు 11,28,636 మంది మాత్రమే హాజరయ్యారు. ఆన్‌లైన్‌లో 19,820 మంది, ఆఫ్‌లైన్‌లో 1,78,408 మంది అర్హత సాధించారు. వీరిలో 40 వేల మంది వరకూ బాలికలున్నారు. జనరల్ 100 మార్కులు, ఒబిసి 70 మార్కులు, ఎస్సీ 52, ఎస్టీ 48 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. పంజాబ్ నుండి 2073 మంది, హర్యానా నుండి 4358 మంది, మధ్యప్రదేశ్ నుండి 18వేల మంది, మహారాష్ట్ర నుండి 14వేల మంది , తెలుగు రాష్ట్రాల నుండి 12వేల మంది అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ఐఐటి భువనేశ్వర్‌లో 180, ముంబైలో 903, మండిలో 145, ఢిల్లీలో 851, ఇటానగర్‌లో 120, ఖరగ్‌పూర్‌లో 1341, హైదరాబాద్‌లో 220, ఐఐటిజెలో 120, ఐఐటికెలో 853, ఐఐటిఎంలో 838, ఐఐటి జిఎన్‌లో 150, ఐఐటిపిలో 200, ఐఐటిఆర్‌లో 1030, ఐఎస్‌ఎంలో 935, ఐఐటి రాయిపూర్‌లో 130, ఐఐటి భువనేశ్వర్‌లో 1090, ఐఐటిజిలో 660, ఐఐటి పికెడిలో 120, ఐఐటిటిలో 120 సీట్లున్నాయి. గత ఏడాది 9974 సీట్లకు గానూ 9074 మంది అబ్బాయిలు, 900 మంది అమ్మాయిలు ఎంపికయ్యారు. వీరిలో జనరల్ అభ్యర్ధులు 4994 మంది, ఒబిసి 2716, ఎస్సీ 1503 మంది, ఎస్టీలు 761 మంది ఉన్నారు. గత ఏడాది పరీక్ష రాసిన వారిలో 48501 మంది జనరల్, 46,800 మంది ఒబిసి, 20,667 మంది ఎస్సీ, 8773 మంది ఎస్టీలు ఉన్నారు. ఎక్కువ మంది అభ్యర్ధులు ఐఐటి మద్రాస్‌పైనే దృష్టిసారించారు. గత ఏడాది టాప్ 10లో ఐదుగురు ఐఐటి మద్రాస్‌లోనే చేరగా, ఒకరు ముంబైలోనూ, ఇద్దరు ఐఐటి ఢిల్లీలోనూ, ఒకరు కాన్పూర్‌లోనూ, ఒకరు రూర్కీలోనూ చేరారు. మూడు సబ్జెక్టుల్లోనూ అత్యంత సంక్లిష్టమైన పేపర్ కెమిస్ట్రీగానే విశే్లషిస్తున్నారు. ఫిజిక్స్ పేపర్-1, 2 కలిపి ఎక్కువ మందికి 100 మార్కులు వరకూ రాగా, కెమిస్ట్రీలో 50 మార్కులు దాటిన వారిన సంఖ్య 150 మాత్రమే, అదే మాథ్స్ పేపర్ 60 మార్కులు దాటిన వారు 200కు పైగా ఉండగా, 100 మార్కులు దాటిన వారు 50 మందికి మించి ఉన్నారు. మొత్తం మూడు సబ్జెక్టులు కలిపి 200 మార్కులు దాటిన వారు వంద మంది మాత్రమే మిగిలారు. ప్రతి పేపర్‌కూ 168 మార్కులు వరకూ కేటాయించారు.