రాష్ట్రీయం

కుదేలైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: ఆర్థిక వ్యవస్థకు వెనె్నముకగా నిలిచే గ్రామీణ వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుందని, గ్రామీణ ప్రజల బ్యాంకు రుణాలను ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అసోచామ్ కోరింది. 11 రాష్ట్రాల్లోని 265 జిల్లాల్లో 33 కోట్ల మంది ప్రజలు కరవు కోరల్లో చిక్కుకున్నారని, రూ. 6.50 లక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్ధ అతలాకుతలమైందన్నారు. గ్రామీణ వ్యవస్థ చక్కదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా బృందాలను నియమించాలన్నారు. మంగళవారం ఇక్కడ అసోచామ్ అధ్యక్షులు సునీల్ కనోరియా, తెలంగాణ అసోచామ్ చైర్మన్ శ్రీకాంత్ బాడిగ, సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్‌లు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామాలకు సబ్సిడీపై ఆహార ధాన్యాలను సరఫరా చేయాలని కోరారు. దేశంలో గ్రామీణ ఆర్థిక రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉందని, ఏడు శాతం జిడిపి సాధించినా ఉపయోగం లేదన్నారు.
సమీకృతాభివృద్ధిని సాధించాలంటే అన్నిరంగాల్లో సమానంగా పురోగమించాల్సి ఉందన్నారు. వ్యవసాయ రుణాలపై మారటోరియం విధించాలని, అన్ని రుణాల భారాన్ని బ్యాంకులపై రుద్దాలని తాము కోరడం లేదన్నారు. ఇప్పటికే బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరిగాయన్నారు. గ్రామీణాభివృద్ధికి అన్ని రకాల వనరులను అభివృద్ధి చేయాలన్నారు. రైతు రుణాలను మాఫీచేయాలనే జనాకర్షణ పథకాలను అమలు చేయాలని తాము కోరడం లేదన్నారు. కాని రైతాంగం నిలదొక్కుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
కరవుకాటకాల్లో చిక్కుకున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రుతుపవనాలు సమీపిస్తున్నందు వల్ల వీలైనంత త్వరలో వ్యవసాయం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్నారు.

రాజ్‌భవన్‌లో మంగళవారం గవర్నర్ నరసింహన్‌కు
పుష్పగుచ్ఛం అందజేస్తున్న అసోచామ్ సభ్యులు