రాష్ట్రీయం

బయాలజీ విద్యార్థులకు ‘టెట్’లో అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: అన్ని సబ్జెక్టుల వారికీ అనువుగా ఉన్న టీచర్సు ఎలిజిబిలిటీ టెస్టు (టెట్) బయాలజీ విద్యార్థులకు మాత్రం అనువుగా లేదని, పరీక్ష విధానంలో మార్పులు చేయాలని టెట్ అభ్యర్ధులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉపాధ్యాయుల నియామకాలు భారీగా జరుగుతాయని ఆస్తున్న తమకు ఈ పరీక్ష ప్యాటర్న్ కలవరాన్ని కలిగిస్తోందని వారు చెబుతున్నారు. పరీక్ష విధానం చూసి భరించలేక నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన బయోసైన్స్ అభ్యర్ధిని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తూ, ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకోవాలని కోరుతున్నారు. టెట్‌లో గణితాన్ని తొలగిస్తే తప్ప తమకు మనుగడ లేదని వారు చెబుతున్నారు. టెట్ పేపర్-2లో సోషల్ రాసిన వారికి సైకాలజీలో 30, తెలుగులో 30, ఇంగ్లీషులో 30 ప్రశ్నలు ఇస్తూ వారి మాతృ సబ్జెక్టు, మెయిన్ సబ్జెక్టు అయిన సాంఘిక శాస్త్రం నుండి 60 ప్రశ్నలు ఇస్తున్నారు. అదే గణిత శాస్త్రంలో అభ్యర్ధులకు జీవశాస్త్ర అభ్యర్ధులతో కలిపి పేపర్ -2లో గణితం, సైకాలజీ 30 మార్కులు, తెలుగు 30 మార్కులు, ఇంగ్లీషు 30 మార్కులు ప్రశ్నలు ఇస్తూ గణితం నుండి 30 మార్కులు, ఫిజికల్‌సైన్స్ కంటెంట్ నుండి 12 ప్రశ్నలు ఇస్తూ, బయాలజీ కంటెంట్ నుండి 12 ప్రశ్నలు, సైన్స్ మెథడాలజీ నుండి ఆరు ప్రశ్నలు ఇస్తున్నారు. దీనివల్ల బయో అభ్యర్ధులకు బయాలజీ నుండి నేరుగా కేవలం 12 మార్కులకు మాత్రమే ప్రశ్నలు వస్తున్నాయని నల్లగొండ జిల్లాకు చెందిన బయో అభ్యర్ధి ఎస్ ఉపేంద్రాచారి పేర్కొన్నారు. గణితం నుండి 30, భౌతిక రసాయన శాస్త్రాల నుండి 12 మార్కులకు ప్రశ్నలు వస్తున్నాయని, బయాలజీ అభ్యర్ధులకు గణితం పదో తరగతి వరకే ఉంటుందని, ఆ తర్వాత గణితం ఉండదని, భౌతిక, రసాయన శాస్త్రాలు ఇంటర్ వరకూ, కేవలం రసాయన శాస్త్రం మాత్రం డిగ్రీలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద చూస్తే బయోసైన్స్ వారు 42 మార్కులు నష్టపోవల్సి వస్తుందని, మిగిలిన 108 మార్కుల్లో జనరల్ అభ్యర్ధులు 90 మార్కులు, రిజర్వుడ్ అభ్యర్ధులు 60 నుండి 75 వరకూ పొందితేనే అర్హత సాధింగలుగుతారని ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పరీక్ష ప్యాటర్న్ మార్చాలని బయో అభ్యర్ధుల తరఫున ఉపేంద్రాచారి కోరారు.