రాష్ట్రీయం

ఆన్‌లైన్ మోసం గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: అమెరికా, కెనెడాలో ఆకర్షణీయమైన వేతనంతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఆన్‌లైన్‌లో నిరుద్యోగులను మోసం చేసే నలుగురు ఘరానా సైబర్ నేరగాళ్ల గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. జేమ్స్ మార్టిన్, క్రిస్ట్ఫోర్ అనే ఇద్దరు నైజీరియన్లు, మిజోరంకు చెందిన లాల్చనామి అనే యువతి, ఎమాన్యూల్ లాల్తియాంగ్లిమా అనే వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక లక్ష రూపాయల నగదు, ఎటిఎం కార్డులు, నకిలీ డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల, ఎల్‌బి నగర్‌కు చెందిన ఐదుగురు బాధితులు తాము ఐదు లక్షల రూపాయల చొప్పున నగదును నిందితులకు చెల్లించి మోసపోయామని ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్స్ పోలీసులు రంగంలోకి నిందితులను అరెస్టు చేశారు. లాల్చనామి, ఎమాన్యుయెల్ లాల్తియాంగ్లిమా శంషాబాద్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని 70 బ్యాంకుల్లో రకరకాల పేర్లతో అకౌంట్లు తెరిచారు.
ఈ అకౌంట్లను నైజీరియన్లు జేమ్స్ మార్టిన్, క్రిస్ట్ఫోర్‌తో కలిసి ఈ అకౌంట్లను ఆపరేట్ చేసేవారు. అమెరికా, కెనెడాలో హెచ్‌ఆర్ మేనేజర్లు, ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇచ్చారు. నెలకు ఎనిమిది నుంచి పదివేల డాలర్ల జీతం, బీమా, ఇల్లు, కారు, ఇతర సదుపాయాలు ఉంటాయని కూడా తమను ఆశ్రయించే నిరుద్యోగులకు చెప్పేవారు. వీరు వాస్తవానికి బెంగళూరులో కూడా ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడి నుంచి కూడా ఆపరేట్ చేసేవారు. వీరి ఉచ్చులో పడి రాజధానికి చెందిన ఐదుగురు మోసపోయి ఐదు లక్షల రూపాయల చొప్పున నగదు ఇచ్చారు. ఆ తర్వాత వీరు కనపడకపోవడంతో, బాధితులు సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి 13 పాన్‌కార్డులు, ఆరు ఓటర్ ఐడి కార్డులు, 13 డ్రైవింగ్ లైసెన్సులు, 22 ఎటిఎం కార్డులు, 15 సిమ్ కార్డులు, ఆరు మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు కొరియన్ పాప్ సింగర్, నటి బే సుజీ శంషాబాద్‌లో నివాసం ఉన్నట్లు ఆధారాలు సృష్టించి బ్యాంకు అకౌంట్లను తెరిచారని పోలీసులు తెలిపారు. వీరు ఫోటోషాప్ ద్వారా నకిలీ ఐడి కార్డులు తయారు చేసేవారని పోలీసులు తెలిపారు. రకరకాల ఇమెయిల్ ఐడిలను కూడా ఉపయోగించేవారు. వీరిని అరెస్టు చేసిన తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి ప పించారు. వీరి బారిన పడిన మోసపోయిన వారు 9490617437కు ఫోన్ చేసి వివరాలు అందించాలని సైబర్ క్రైమ్ సిఐ మహమ్మద్ రియాజుద్దీన్ తెలిపారు.