ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో కుంభవృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 18: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తిరుమలలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం, రంగనాయకుల మండపం ముందు భాగాల్లోకి వరద నీరు ప్రవేశించింది. అప్రమత్తమైన ఇవో సాంబశివరావు యంత్రాలద్వారా నీటిని తోడించారు. ఈ సమయంలో భక్తులను మహాద్వారం వద్ద నిలిపివేశారు. వర్షం కారణంగా భక్తు లు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొంతమంది భక్తు లు గదులకే పరిమితమయ్యారు. వర్షం కారణంగా హథీరాంజీ మఠం వద్దనున్న విద్యుత్ కేబుల్స్ షార్ట్‌షర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఈ సందర్భంగా దట్టమైన పొగలు వ్యాపించాయి.