రాష్ట్రీయం

ఆంధ్రను ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డిఎస్) ఆధునీకరణ పనులకు అడ్డపడకుండా ఆంధ్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆర్డీఎస్ వద్ద జరగుతున్న ఆధునీకరణ పనులకు అనుమతి, దానికయ్యే వ్యయాన్ని కర్నాటక ప్రభుత్వానికి చెల్లించింది కూడా ఉమ్మడి ఆంధ్రలోనేనని తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేసింది. ఆర్డీఎస్ ఆధునీకరణ పనులను ఆపాలంటూ కర్నాటక ప్రభుత్వాన్ని ఆంధ్ర సర్కారు కోరడంపట్ల తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంలో జోక్యం చేసుకొని ఆర్డీఎస్ పనులకు ఆంధ్ర సహకరించేలా చూడాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈమేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు, ఆంధ్ర నీటిపారుదల శాఖకు వేర్వేరుగా బుధవారం లేఖలు రాశారు. ఆర్డీఎస్ అంతరాష్ట్ర ప్రాజెక్టుగా 50ఏళ్ల కిందటే డిజైన్ చేసిందని లేఖలో గుర్తు చేశారు. కర్నాటకలో 5,879 ఎకరాలు, తెలంగాణలోని 87,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేలా డిజైన్ చేశారని పేర్కొన్నారు. అయితే తెలంగాణకు కేటాయించిన 15.9 టిఎంసి నీటికిగాను 5 టిఎంసి నీరు మాత్రమే అందుతుండటంతో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హయాంలోనే ఆధునీకరణ పనులు చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో 645 జారీ చేసిందని లేఖలో పేర్కొన్నారు. ఆధునీకరణ పనులకు కర్నాటక రాష్ట్ర పరిధిలో రూ.38 కోట్లు, తెలంగాణ పరిధిలో రూ.29 కోట్ల ఖర్చవుతుందని, మొత్తంగా రూ.72 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిందని పేర్కొన్నారు. అయితే, అంచనా వ్యయం రూ.92 కోట్లకు చేరిన నేపథ్యంలో, పెరిగిన అంచనాల మేరకు తెలంగాణ వాటాగా 2007 నుంచి 2009 వరకు రూ.59 కోట్లు విడతలవారీ కర్నాటకకు చెల్లించినట్టు లేఖలో పేర్కొన్నారు. ఆధునీకరణ పనులు ఉమ్మడి రాష్ట్రంలోనే 2014లో ప్రారంభమైతే, కర్నూలు జిల్లా రైతులు వాటిని అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఆర్డీఎస్ ఆధునీకరణ పనులు చేపట్టడం వల్ల కర్నూలు జిల్లా రైతులకు ఎలాంటి నష్టం లేదని తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకొని పనులను అడ్డుకోకుండా ఆంధ్ర ప్రభుత్వం సహకరించేలా చూడాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి తన లేఖలో విజ్ఞప్తి చేశారు.