రాష్ట్రీయం

అక్రమాలకు తావులేకుండా ఆన్‌లైన్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఆన్‌లైన్‌లో సేవలందించటమే తమ లక్ష్యమని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు.
పుణె నగర పాలక సంస్థ అమలు చేస్తున్న డెవలప్‌మెంప్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డిపిఎంఎస్) ఆన్‌లైన్ సేవలను హెచ్‌ఎండిఏలో ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ జూన్ నెలాఖరు నాటికి ఈ ఆన్‌లైన్ సేవలను రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల్లో కూడా అమలు చేస్తామన్నారు. ఇటీవల రూపకల్పన చేసిన వందరోజుల ప్రణాళికలో భాగంగా జిహెచ్‌ఎంసిలో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తామన్నారు. అవినీతి, దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపి సిబ్బంది పనితీరులో జవాబుదారితనం, పారదర్శకతను పెంపొందించేందుకు ఇలాంటి విధానాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
వందరోజుల ప్రణాళికతో అన్ని మున్సిపల్ సంస్థల్లో ప్రజలకు మెరుగైన సేవలందించే ప్రయత్నం మొదలైందన్నారు. గతంలో లే అవుట్, నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే అది ఎపుడు వస్తుందో తెలియని అయోమయం నెలకొనేదన్నారు. ఇప్పుడు ముప్పై రోజుల్లో తప్పనిసరిగా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని, ఒకవేళ ఆలస్యమైతే ఎందుకు ఆలస్యమైందో, దరఖాస్తు పరిశీలించకుండా ఎందుకు తిరస్కరించారో సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.

బుధవారం హైదరాబాద్ హెచ్‌ఎండిఏ కార్యాలయంలో
డిపిఎంఎస్ సేవలను ప్రారంభిస్తున్న తెలంగాణ మంత్రి కెటిఆర్.