రాష్ట్రీయం

దేశంలో నూతన విద్యావిధానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: దేశంలో నూతన విద్యా విధానం అమలుతో విద్యారంగంలో పెను సంచలనాలు సంభవించనున్నాయి. ఇంతకాలం సంప్రదాయ చట్రంలో ఇరుక్కున్న విద్యారంగం ఇక ఉరుకులు పెట్టనుంది. ఇందుకు వీలుగా అవసరమైన నిధులను పెద్ద ఎత్తున సమకూరుస్తూనే మరో పక్క రానున్న 20 ఏళ్లలో దేశం విద్యారంగంలో అగ్రగామిగా ఉండేందుకు కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతోంది. ఇందుకు సంబంధించిన సమగ్ర విధానపత్రాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి మరో వారంలో దేశ ప్రజల ముందుంచనున్నారు. గత రెండేళ్లుగా ఈ విధానాన్ని రూపొందించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. ఇందుకు ఎన్‌జిఓలను, విద్యారంగ నిపుణులను, సామాజిక మాధ్యమాలను, ఆధునిక మీడియాను సైతం కేంద్రం వినియోగించుకుంది. ఇంటర్‌నెట్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను సైతం వినియోగించుకుని అభిప్రాయ సేకరణ చేసింది. మై గౌ వెబ్ పోర్టల్ ద్వారా 8.51 లక్షల మంది రిజిస్టర్డ్ వినియోగదారులను, 90 వేలకు పైగా ఉన్న ట్విట్టర్ భాగస్వాములను, 25 మంత్రిత్వ శాఖలను ఇందులో భాగస్వామ్యం చేశారు. ప్రమాణాలను పెంచేందుకు సుపరిపాలనా సంస్కరణలు, విద్యాసంస్థలకు ర్యాంకులు, అక్రిడిటేషన్లు, నాణ్యత పెంచడం, నియంత్రణ, కేంద్ర విద్యాసంస్థల నియంత్రణ, విశ్వవిద్యాలయాలను మెరుగుపర్చడం, ఉన్నత విద్యతో నైపుణ్యాలను అనుసంధానం చేయడం, దూరవిద్య- ఆన్‌లైన్ కోర్సులను పెంచడంతో పాటు అందరికీ అందుబాటులో ఉంచడం, మరీ ముఖ్యంగా మూక్స్‌కు ప్రాచుర్యం కల్పించడం, సాంకేతిక పరిజ్ఞానం ఆధారితంగా అభ్యసన అవకాశాలను మెరుగుపరుచుకోవడం, ప్రాంతీయ అసమానతలను గుర్తించి వాటిని నివారించడం, లింగ వివక్ష తొలగించడం, సామాజిక వివక్షను గుర్తించి విద్యారంగంలో లేకుండా చూడటం, సమాజాన్ని ఉన్నత విద్యను అనుసంధానం చేయడం, ఉత్తమ ఉపాధ్యాయులను తీర్చిదిద్దడం, విద్యార్థులకు సహకరించేలా బోధన అభ్యసన అవకాశాలను పెంచడం, భాష ద్వారా సాంస్కృతిక సంలీనం, ప్రైవేటు సంస్థలతో అర్ధవంతమైన భాగస్వామ్యాన్ని సాధించడం, ఉన్నత విద్యా రంగంలో ఆర్థిక పెట్టుబడులు, ఉన్నత విద్యను అంతర్జాతీయకరణ, ఉపాధికి- ఉన్నత విద్యకు అనుసంధానం, పరిశోధనలు, వినూత్న ఆవిష్కరణలకు అవకాశం పెంచడం, నూతన జ్ఞానాన్ని పొందడం వంటి అంశాలపై ఉన్నత విద్యా రంగంలో దృష్టిసారించిన కేంద్రం పాఠశాల విద్యపైనా అంతే దృష్టిని పెట్టింది.
శిశు విద్య, ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, మొత్తంగా పాఠశాల విద్య, బోధన అభ్యసన అనుభవాలు, వాటి ప్రతిఫలనాలు, ప్రతి జనావాసానికి సాధారణ విద్య అందుబాటులోకి తీసుకురావడం, వృతి విద్యను పటిష్ఠం చేయడం, ఉపాధ్యాయ విద్యను పునర్వ్యవస్థీకరించడం, గ్రామీణ అక్షరాస్యతను పరుగుపెట్టించడం, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు వయోజన విద్య, సార్వత్రిక విద్య విధానాల ద్వారా చదువరుల సంఖ్యను పెంచడం, ఐసిటిని విరివిగా వినియోగించుకోవడం, నూతన విజ్ఞానాన్ని అలవరచుకోవడం, బోధన రంగంలో నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, ముఖ్యంగా బోధన పద్ధతుల్లో మార్పు, పాఠశాలల స్థాయిత్వాన్ని పెంచడం, సమ్మిళిత విద్య అమలు, భాషలకు ప్రోత్సాహం, నైతిక విలువలను పెంచడం, వయోజన విద్య, కళలు, వృత్తినైపుణ్యాలు, జీవన నైపుణ్యాలను అలవరచడం, శిశు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం కూడా నూతన విద్యా విధానంలో భాగంగా ఉండనున్నాయి.
కేంద్రానికి ఆధిపత్యం
నూతన విద్యా విధానంలో భాగంగా ఉమ్మడి జాబితాలోని విద్యా రంగం పూర్తిస్థాయిలో కేంద్రం ఆధీనంలోకి రానుంది. విద్యారంగంలో వస్తున్న అనేక సమస్యల పరిష్కారం రోజురోజుకూ సంక్లిష్టంగా మారుతున్న తరుణంలో కేంద్రం ఈ చర్యలను చేపట్టేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే పాఠశాల విద్య కేంద్రం ఆధీనంలో ఉంది. ప్రవేశపరీక్షలు, ప్రమాణాల నియంత్రణ, జాతీయ విధానాలకు మండళ్లు పనిచేస్తూనే ఉన్నాయి. యూనివర్శిటీలు స్వతంత్రంగా పనిచేస్తుండగా దీనికి అదనంగా రానున్న రోజుల్లో ఉన్నత విద్య సైతం కేంద్రం ఆధీనంలోకి రానుంది. రాజ్యాంగపరమైన సంక్షోభం ఇప్పటికపుడు రాకుండా కేంద్రం అన్ని చర్యలనూ తీసుకుంటోంది.
కాలం చెల్లిన పాఠ్యాంశాలకు మంగళం
దశాబ్దాల క్రితం పాఠ్యపుస్తకాలకు ఎక్కిన కాలం చెల్లిన పాఠ్యాంశాలకు మంగళం పలకనున్నారు. నూతన పాఠ్యాంశాలు కొత్తగా వచ్చి చేరనున్నాయి. చరిత్రను వక్రీకరించిన అంశాలను తొలగించి రికార్డులను ఇప్పటికైనా సరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. బోధన విధానాలను ఆధునీకరించే క్రమంలో భాగంగా తరగతి గదులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ తీసుకురాబోతున్నారు. అలాగే పుస్తకాల మోతను తగ్గించి ఒక పోర్టల్ ద్వారా అన్ని మాధ్యమాల్లో అన్ని తరగతుల పుస్తకాలను, వర్క్ బుక్‌లను ఉచితంగా అందుబాటులో ఉంచుతారు. 20 భాషల్లో బోధనాంశాలు, విశే్లషణలు, మార్గదర్శకాలు , బోధకులకు తర్ఫీదు ఇచ్చే బోధన పూర్వ శిక్షణ కార్యాచరణ కూడా అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఇప్పటికే భారతవాణి పేరిట ఒక పోర్టల్‌ను సిద్ధం చేసింది. రానున్న రోజుల్లో అన్ని ప్రవేశపరీక్షలూ ఆన్‌లైన్‌లోనే జరగనున్నాయి.

బివి ప్రసాద్