రాష్ట్రీయం

ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకూ పిఆర్‌సి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 20: ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వోద్యోగులతో సమానంగా పిఆర్‌సి అమలుతో పాటు పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పొడిగించే అంశాన్ని సానుభూతితో పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని ఏపి సిఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అవసరమైతే ఈ అంశంపై మంత్రుల కమిటీ వేసి తుది నిర్ణయం తీసుకుంటామని సిఎం శుక్రవారం మధ్యాహ్నం తనను కలిసిన ఉద్యోగ సంఘాల జెఎసి చైర్మన్ పి.అశోక్ బాబు ఇతర నాయకులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జెఎసి నేతలు 13 డిమాండ్లపై సిఎంతో చర్చించారు. రాష్ట్రంలో 4.60 లక్షల మంది ఉద్యోగులలో కేవలం 20 వేల మంది మాత్రమే పిఆర్‌సికి నోచుకోలేక ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారని, వారి విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని అశోక్ బాబు సిఎంను కోరారు. పిఆర్‌సి అమలు చేయడానికి ఆర్థిక వెసులుబాటు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను తక్షణం ఆదేశించాలని కోరగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవాలని తన కోరిక అంటూ, ప్రైవేటు సంస్థలతో పోటీపడి ఉత్పాదకత పెంచేందుకు వారంతా సహకరిస్తే పిఆర్‌సికి మించిన వేతనాలు ఇచ్చేందుకు వీలు కలుగుతుందని సిఎం అన్నారు. సింగపూర్ వంటి దేశాలలో ప్రభుత్వ రంగ సంస్థలదే హవా అని చెబుతూ, ఇక్కడ కూడా ప్రయత్నిస్తే పిఎస్‌యులకు మంచి భవితవ్యం ఉంటుందన్నారు.
బెరైటీస్ సంపదను ఒక లిస్టెడ్ కంపెనీ పరిధిలోకి తీసుకురావాలన్నదే తన ప్రయత్నమని సిఎం చెప్పారు. అధునాతన సాంకేతికత అందరికీ అందుబాటులో ఉందని, దాన్ని ఉపయోగించుకుంటూ ప్రభుత్వ సేవల్లో నాణ్యతను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆ క్షణం ఉన్న వర్షపాతం వివరాల్ని సిఎం తన ఐప్యాడ్‌లో ఉద్యోగ సంఘాల నాయకులకు చూపించారు.
ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం గొప్ప సంతృప్తిని ఇచ్చిందని సిఎం అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎక్కడైతే బాధ్యతగా పనిచేస్తారో అక్కడ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయని చెప్పారు. తాను ఆశించిన ఫలితాలను రాబడితే గురుకుల పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు పిఆర్‌సికి మించిన మెరుగైన జీతాలు ఇస్తామని ప్రకటించారు.