రాష్ట్రీయం

ఆటా సభలకు ముఖ్యఅతిథిగా రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: అమెరికాలో జరిగే ఆటా సభలకు హాజరు కావాలని కోరుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఆటా ప్రతినిధులు శనివారం కలిశారు. జూలై 1 నుంచి మూడు రోజుల పాటు అమెరికాలోని చికాగోలో జరిగే అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభకు ముఖ్య అతిథిగా రావాలని కెసిఆర్‌ను ఆటా ప్రతినిధులు కోరారు. ఆటా వ్యవస్థాపకులు హన్మంతరెడ్డి, దామోదర్‌రెడ్డి, అధ్యక్షుడు సుధాకర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్, బోర్డు ఆఫ్ ట్రస్టీ ఏనుగు లక్ష్మణ్ తదితరులు క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రిని కలిశారు. సభకోసం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది తెలుగు ప్రముఖులు పాల్గొంటారని వివరించారు. వారి ఆహ్వానానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఆటా ప్రతినిధులతో పాటు ముఖ్యమంత్రిని కలిశారు.

చిత్రం శనివారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో భేటీ అయిన ఆటా ప్రతినిధులు
హన్మంత రెడ్డి, దామోదర్ రెడ్డి, సుధాకర్, కరుణాకర్, లక్ష్మణ్