రాష్ట్రీయం

టాప్ ర్యాంకర్ హేమలత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 21:ఏపి ఎమ్సెట్ (మెడికల్ అండ్ అగ్రికల్చర్)లో కర్నూలుకు చెందిన మాచాని హేమలత 156 మార్కులతో టాప్ ర్యాంక్ చేజిక్కించుకుంది. కాగా మొదటి పది ర్యాంకుల్లో ఆరింటిని తెలంగాణ విద్యార్థులు కైవసం చేసుకోవడం విశేషం. ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విడుదల చేశారు. హైదరాబాద్‌కు చెందిన యర్ల సాత్విక్ రెడ్డి (156 మార్కులు) రెండోర్యాంకును, యజ్ఞప్రియ (153) మూడో ర్యాంకును సాధించారు. అగ్రికల్చరల్ అండ్ మెడికల్ విభాగానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలనుంచి 1,03,222 మంది దరఖాస్తు చేసుకోగా 95.67 శాతంతో 98,752 మంది పరీక్షకు హాజరయ్యారని, 4470 మంది గైర్హాజరయ్యారని కన్వీనర్ సాయిబాబు తెలిపారు. మొత్తంగా 87.59 శాతంతో 86,494 మంది అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో అర్హత సాధించగా వీరిలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారు 4498 మంది విద్యార్థులు ఉండగా 81,986 మందికి ర్యాంకులను కేటాయించామన్నారు. గత సంవత్సరం అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో 7 ప్రశ్నలను తొలగించడం జరిగిందని, ఈ సంవత్సరం అటువంటి తప్పిదాలు ఏమీ లేకుండా ప్రశ్నాపత్రాన్ని సమర్థవంతంగా రూపొందించామని కన్వీనర్ తెలిపారు.
ఫలితాలు విడుదలైన అరగంట తర్వాత విద్యార్థులకు ర్యాంకులను సంక్షిప్త సందేశం ద్వారా విద్యార్థుల ఫోన్ నెంబర్లకు అందించారు. ఇంటర్మీడియట్ పునఃమూల్యాంకనం, పునఃలెక్కింపునకు దరఖాస్తు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల మార్కులను పరిగణనలోకి తీసుకుని వారికి ర్యాంకులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఇంటర్మీడియట్ కాకుండా వేరే బోర్డుల నుంచి ఎంసెట్ ప్రవేశపరీక్షకు హాజరైన 6669 మంది విద్యార్థులకు వారి ఇంటర్ మార్కులు వెల్లడి కాకపోవడం వలన ర్యాంకులు కేటాయించలేదని, వారు మార్కులు అందజేసిన వెంటనే ర్యాంకుల కేటాయింపు జరుగుతుందన్నారు.
ఈ ప్రవేశపరీక్షకు 160 మార్కులకు 40 మార్కులు కనీస అర్హతగా పరిగణిస్తామని, ర్యాంకును నిర్థారించేందుకు ఎంసెట్ మార్కులను 75 శాతం వెయిటేజీగాను, 25 శాతం ఇంటర్మీడియట్ మార్కులను వెయిటేజీగా తీసుకుంటామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వారికి అర్హతా మార్కులు లేవన్నారు. ర్యాంకు కార్డులను మే 21వ తేదీ నుండి విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. మే 21వ తేదీ నుండి ఓఎంఆర్ షీట్‌లను తీతీతీ.్ఘఔళౄషళఆ.్య వెభ్‌సైట్‌లో పొందుపరుస్తామని, వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలించుకోవడానికి ఈ నెల 26వ తేదీలోగా జనరల్ కేటగిరీ విద్యార్థులు రూ.5,000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే రూ.2,000 రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ తెలిపారు.

టాప్ టెన్ ర్యాంకర్లు వీరే!

పేరు ఊరు మార్కులు
మాచాని హేమలత కర్నూలు 156
యర్ల సాత్విక్ రెడ్డి హైదరాబాద్ 155
అమ్మకోల యజ్ఞప్రియ హైదరాబాదు 153
చిట్లూరి నేహ విజయవాడ 152
ఇక్రమ్ ఖాన్ హైదరాబాద్ 152
శొంఠి సాహితీ సావిత్రి సికింద్రాబాద్ 152
పెద్దిరెడ్ల శైలజ విశాఖపట్నం 150
బలభద్ర గ్రీష్మ మీనన్ వరంగల్ 150
దారం శివకుమార్ నల్గొండ 150
కె. సాయి ప్రదీప్ రెడ్డి ప్రకాశం 150