రాష్ట్రీయం

తరలక తప్పదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 21: ఎవరికి ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ వచ్చే జూన్ మాసాంతానికల్లా ప్రభుత్వ శాఖలన్నీ రాజధాని అమరావతికి తరలిరావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్భ్రావృద్ధి కోసం కొన్ని త్యాగాలు చేయక తప్పదన్నారు. ఎంసెట్ మెడిసిన్ ఫలితాల విడుదల సందర్భంగా సిఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ఇంతకాలం అలవాటుపడిన వారు గ్రామీణ ప్రాంతానికి తరలిరావటంవల్ల కొంతకాలం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందనేది ఎవరూ కాదనలేరన్నారు. అసలు ఇప్పటికే తరలింపులో ఎంతో జాప్యం జరిగిందని, దీనికి తానెంతో బాధపడుతున్నానన్నారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉన్నప్పుడు తొందర ఏమిటంటూ విమర్శించిన వారు లేకపోలేదన్నారు. రాజధానికి గూడు లేకపోయినా తాను బస్సులోనే గడిపి పాలన సాగించిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా అభివృద్ధి రేటు 10.99 శాతం సాధించాం కదా అన్నారు. హైదరాబాద్ తరహాలోనే సచివాలయం, డైరెక్టరేట్లు వేర్వేరుగా ఉండాలనే అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతోందంటూ మంత్రులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, అన్ని శాఖల హెచ్‌వోడిలు ఒకేచోట ఉంటేనే పరిపాలన మరింత వేగవంతంగా జరుగుతుందన్నారు. ఆంధ్రుల అభీష్టానికి భిన్నంగా రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగిన పాపాన్ని నేటికీ అనుభవిస్తున్నామంటూ అందుకే జూన్ రెండో తేదీన భారీ ఎత్తున నవ నిర్మాణ సంకల్ప దీక్ష నిర్వహించ బోతున్నామన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా జూన్ 8న ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు తెలియజెప్పేందుకై విజయోత్సవ సభ నిర్వహించ బోతున్నామన్నారు. ప్రత్యేక హోదాపై ప్రస్తావిస్తూ దీనిపై కేంద్రంతో సంప్రదింపులు సాగిస్తూనే ఉన్నానంటూ ప్రత్యేక హోదా సాధించిన రాష్ట్రాల్లో ఏ మేర అభివృద్ధి జరిగిందంటూ ఎదురు ప్రశ్న వేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్వాకం వల్ల నేటికీ ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రతిపక్ష నేత జగన్ విమర్శలు ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ తోసిపుచ్చారు. హైదరాబాద్ నుంచి ఉద్యోగులందరూ తరలిరావాల్సిందేనంటూ తన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ కనీసం మనవడిని చూసుకోవడానికి కూడా తాను వెళ్లలేకపోతున్నానని నవ్వుతూ అన్నారు.

chitram విలేఖరులతో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు