రాష్ట్రీయం

కృష్ణా డెల్టాకు ఆగిన నీటి సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, మే 21: నాగార్జునసాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా కృష్ణా డెల్టాకు విడుదలవుతున్న నీటిని శనివారం సాగర్ ప్రాజెక్టు అధికారులు పూర్తిగా నిలిపివేశారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు కృష్ణా రివర్ బోర్డుకు విన్నవించుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్ర, తెలంగాణ అధికారుల సమావేశంలో తాగునీటి అవసరాల నిమిత్తం కృష్ణా డెల్టాకు 1.4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 17వ తేదీన కృష్ణా డెల్టాకు నీటి విడుదల కొనసాగించారు. 20వ తేదీ సాయంత్రానికి 1.08 టీఎంసీల నీటిని విడుదల చేశారు. శనివారం ఉదయం 0.03 టీఎంసీల నీటిని విడుదల చేసి, మధ్యాహ్నం కృష్ణా డెల్టాకు నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. నాలుగు రోజులుగా సాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా నీటిని విడుదల చేయడంతో సాగర్‌లో 5.68 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 507.40 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఇది 127.2928 టీఎంసీలకు సమానం. జంట నగరాల మంచినీటి అవసరాల నిమిత్తం నాలుగు వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుండి 1038 క్యూసెక్కుల నీరు సాగర్ జలాశయానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 775 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 18.50 టీఎంసీలకు సమానం.

చిత్రం సాగర్ జలాశయం నుండి కృష్ణా డెల్టాకు నిలిచిపోయిన నీరు