రాష్ట్రీయం

పేరుపై హోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21:తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడును కొందరు తప్పుదోవపట్టిస్తున్నారన్న అసంతృప్తి తెదేపా సీనియర్ నాయకులలో పెరుగుతోంది. క్షేత్రస్థాయి సమాచారం తెలియనివారే బాబును తప్పదోవ పట్టిస్తున్నారన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. పార్టీకి దన్నుగా ఉన్న కాపులను దూరం చేసుకునే చర్యలను బాబు సన్నిహితులు ప్రోత్సహిస్తున్న తీరును సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి ఆత్మగౌరవం దెబ్బతీసేలా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల, కాపులు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గుంటూరులో నిర్మించ తలపెట్టిన కాపుభవన్‌కు చంద్రబాబు పేరు పెట్టడంపై వివాదం కొనసాగుతోంది. దీనిపై ఇప్పటికే కాపు నేతలు, సంఘాలు టిడిపిపై బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. ఇది తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, తమ కులంలో మహామహులు అనేకమంది ఉండగా, చంద్రబాబు పేరు పెట్టడమేమిటని మెజారిటీ కాపుసంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
కాపు వర్గానికి చెందిన వైసీపీ నేత అంబటి రాంబాబు, రాష్ట్ర కాపు యువసేన అధ్యక్షుడు కర్ణ శ్రీనివాసరావు ఇప్పటికే మీడియా సమావేశాలు ఏర్పాటుచేసి, కాపుభవన్‌కు బాబు పేరు పెట్టడం కాపులను అవమానించడమేనని విరుచుకుపడుతున్నారు. ఈ ప్రచారాన్ని టిడిపిని వ్యతిరేకించే కాపుసంఘాలు ఇప్పటికే గ్రామస్థాయికి చేర్చే పనిలో ఉన్నాయి. పైగా ఈ ప్రతిపాదనను సమర్ధిస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వైఖరిని పార్టీలతో సంబంధం లేని కాపులు, సంఘాలు నిరసిస్తున్నాయి. ‘ఇది అనవసరంగా కాపులను రెచ్చగొట్టడంతోపాటు, కాపులు టిడిపికి ఎప్పుడు దూరమవుతారా అని ఎదురుచూస్తున్న జగన్‌కు అవకాశం కల్పించడమే అవుతుంది. కాపుభవనానికి వాళ్ల కులానికి చెందిన ప్రముఖుల పేర్లు పెట్టడమే సబబు కదా? మా కుల భవనాలకు మా కుల ప్రముఖుల పేర్లే పెట్టుకుంటాం గానీ మరో కులం వారి పేరు పెట్టం కదా? కమ్మ సంఘ భవనాలకు వంగవీటి రంగా, ముద్రగడ పద్మనాభం పేర్లు పెడితే ఆ కులం వాళ్లు ఒప్పుకుంటారా? ఇవన్నీ ఒక కులాన్ని కించిపరిచి, వారిని అనవసరంగా పార్టీకి దూరం చేసుకునే చర్యలే కదా? మరి ఇలాంటి సలహాలు బాబుగారికి ఎవరు ఇస్తున్నారో? ఎందుకు ఇస్తున్నారో? వాటిని సారు ఎందుకు అంగీకరిస్తున్నారో అర్ధం కావడం లేద’ని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. తమకు రేపటి ఎన్నికల్లో కాపుల అవసరం ఉందని, ఇలాంటి నిర్ణయాల వల్ల వారు దూరమవుతే తమ పరిస్థితి ఏమిటని ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ఇతర కులాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సర్కారు పథకాలకు బాబు పేరు పెట్టడం వరకూ ఫర్వాలేదని, కానీ ఒక కుల భవనాలకు మరొక కులం వారి పేర్లు పెట్టడం, కచ్చితంగా వారిని అవమానించడంగానే భావిస్తారని విశే్లషిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో కాపుల మద్దతుతో మళ్లీ గెలవాలని భావిస్తున్నప్పుడు, ఇలాంటి నిర్ణయాలు వారిని దూరం చేసుకోవడమేనంటున్నారు. ఆ భవనాలకు కాపుకులంలో పుట్టిన కనె్నగంటి హనుమంతు, మహానటుడు ఎస్వీ రంగారావు, మహానటి సావిత్రి వంటి ప్రముఖులలో ఒకరి పేరు పెడితే కాపులు కూడా ప్రభుత్వాన్ని మెచ్చుకునే వారని చెబుతున్నారు. దానికి భిన్నంగా కమ్మ వర్గానికి చెందిన బాబు పేరు పెడితే అది సహజంగానే వారిని అవమానించినట్టవుతుందని, ఈపాటి ఆలోచన, విశే్లషణ కూడా బాబు సలహాదారులకు లేకపోవడం దురదృష్టకరమంటున్నారు.
బాబు సలహాదారులు ప్రతిపక్షనేత జగన్‌కు పనికల్పిస్తున్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తుని హింసాకాండ అనంతరం జరిగిన పోలీసుదాడులు, కేసుల వేధింపులతో కొంతమేరకు కాపులు పార్టీకి దూరమయ్యారని, ఇప్పుడు కాపు భవనాలకు బాబు పేరు పెడితే మిగిలిన వారు కూడా దూరమయ్యే విషయాన్ని అధినేత గ్రహించాలని సూచిస్తున్నారు.