రాష్ట్రీయం

వాణిజ్య ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,మే 21: మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి వాణిజ్య పన్నుల వ్యవస్థను, వసూళ్లను పటిష్ట పర్చాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. సరిగ్గా పన్నులు కట్టేవారికి ప్రోత్సాహకంగా, పన్నులు ఎగవేసే వారిపట్ల కఠినంగా, బాగా పని చేసే అధికారులను వెన్నుతట్టేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని సూచించారు. వాణిజ్య పన్నుల శాఖపై క్యాంపు కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి అత్యధిక ఆదాయం సమకూర్చే వాణిజ్య శాఖను పటిష్టం చేసుకోవాలని, అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని చెప్పారు. ఖాళీలన్నీ భర్తీ చేయాలని, వెంటనే పదోన్నతులు ఇవ్వాలని సూచించారు. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రావలసినంత ఆదాయం పూర్తి స్థాయిలో వస్తుందా? లేదా? అనే అంశాన్ని శాస్ర్తియంగా బేరీజు వేసుకోవాలన్నారు. వంద శాతం పన్నులు వసూలయ్యే విధానం అమలు చేయాలని సూచించారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహించే ఉద్యోగులను ప్రోత్సహించే కార్యక్రమాలు రూపొందించాలని, పన్నులు సక్రమంగా చెల్లించే వ్యక్తులు, సంస్థలను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. 3,600 కోట్ల రూపాయల బకాయిలు కోర్టు వివాదాల్లో ఉన్నాయని, ఆ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా జరిపే కొనుగోళ్ల సందర్భంగా టిడిఎస్ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పదవీ విరణమ చేసే అధికారుల సేవలను, అనుభవాలను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. బడ్జెట్, బడ్జెటేతర వ్యయం ద్వారా రాష్ట్రంలో అనేక కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని, ఫలితంగా పన్నులు మరింత ఎక్కువ వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. సమీక్షలో ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా, వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ అనిల్, , జాయింట్ కమీషనర్ రేవతి రోహిణి, అదనపు కమీషనర్ కె చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం వాణిజ్య పన్నుల వ్యవస్థ ప్రక్షాళనపై సిఎం కెసిఆర్ సమీక్ష