రాష్ట్రీయం

చంద్రన్నపై తగ్గిన బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22:కాపు భవనాలకు చంద్రన్న భవన్‌గా నామకరణం చేసే విషయంలో ఆ సామాజికవర్గం, ఇతర పార్టీనేతల నుంచి వెల్లువెత్తిన నిరసనలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తలొగ్గారు. గుంటూరులో నిర్మించనున్న కాపు భవనానికి చంద్రన్న భవన్‌గా నామకరణం చేయడాన్ని సొంత మంత్రులే తప్పుపడుతున్నారని, వారితోపాటు తెదేపాకు మద్దతునిస్తున్న కాపులు కూడా తాజా నిర్ణయాలతో పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందంటూ ఆదివారం నాటి ఆంధ్రభూమి దినపత్రికలో వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే. దానితో రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరావు, కృష్ణాజిల్లా అధ్యక్షుడు బేతు రామ్మోహన్‌రావు, నగర నేత విక్రమ్‌నాగు, ఎర్రంశెట్టి అంజిబాబు తదితరులు సీఎం చంద్రబాబును ఆదివారం కలిశారు. పిళ్లాను చూడగానే బాబు ‘పిళ్లాగారు ఏదో తీసుకొచ్చినట్లున్నారే’ అంటూ నవ్వుతూ ఆహ్వానించారు. తమ కుల సంఘ భవనాలకు మీ పేరు పెట్టడం సబబు కాదని, దానివల్ల మీ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న కాపులు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని పిళ్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రన్న భవన్ పేరు పెట్టడం వల్ల కాపుల ఆత్మగౌరవం దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దానితోపాటు కాపు రుణ వయోపరిమితిని పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపిన కాపునేతలు.. కాపు భవనాలకు శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహనరంగా, రఘుపతి వెంకటరత్నం నాయుడు వంటి ప్రముఖుల పేర్లు పెట్టాలని సూచించగా, బాబు సానుకూలంగా స్పందించారు. ఆ సందర్భంలో ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే జరిగిందని వివరణ ఇచ్చారు.
కాగా రానున్న రాజ్యసభ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన కాపులకు ఒక సీటు ఇవ్వాలని ఇవ్వాలని కోరగా, ‘సీతారామలక్ష్మికి ఇచ్చాం కదా!’ అని సీఎం వ్యాఖ్యానించారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారని, ఈసారి కూడా ఇవ్వాలని కోరగా పరిశీలిద్దామంటూ సిఎం దాటవేశారు.
ఇదిలాఉండగా, అంతకుముందు సీపీఐ జాతీయ నేత కె నారాయణ, కాపునాడు రాష్ట్ర కమిటీ మీడియాతో మాట్లాడుతూ కాపు భవనాలకు చంద్రబాబు పేరు పెట్టడాన్ని తప్పుపట్టారు. దానిని ఉపసంహరించుకోకపోతే, ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కాగా ఆదివారంనాడే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికార ప్రకటన కూడా వెలువడింది. సీఎంఓ అనుమతి లేకుండాప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టవద్దని ఆదేశించింది. ముందస్తు అనుమతి లేకుండా ఇలాంటి పేర్లు పెట్టవద్దని ఆదేశించింది.
ఇదిలాఉండగా, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అత్యుత్సాహం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కాపు సంఘాలతోపాటు, టిడిపిలోని కాపునేతలు కూడా గుర్రుమంటున్నారు. బాబును మెప్పించేందుకు ఆయన తీసుకున్న ఇలాంటి నిర్ణయంతో యావత్ కాపు జాతి పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని, ఈ విషయంలో బాబు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికయినా స్పందించినందుకు సంతోషమని, లేకపోతే ఈ అంశం ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా పరిణమించి, పార్టీకి కాపులు దూరమయ్యేవారని వ్యాఖ్యానిస్తున్నారు. బాబును మెప్పించేందుకు అధికారులు, మంత్రులు, అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, ఒకరకంగా వారంతా బాబును కావాలనే అప్రతిష్ఠపాలుచేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సిఎం చంద్రబాబు ప్రమేయం లేదు
విజయవాడ:ప్రతి జిల్లా కేంద్రంలోను నిర్మించబోయే కాపు భవనాలకు, అలాగే విదేశ విద్య పథకానికి, రుణ సహాయానికి... ఇలా ఈ మూడు పథకాలకు చంద్రన్న పేరు పెట్టాలని కార్పొరేషన్ పాలకవర్గం నిర్ణయం తీసుకున్నదని, ఇందులో సిఎం చంద్రబాబు ప్రమేయం లేదని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు. కాపులను బిసి జాబితాలో చేర్చే అంశంపై కమిషన్‌ను నియమిస్తూనే ఎవరూ ఏమీ అడగకుండానే పలు పథకాలను ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతగా ఆ పథకాలకు చంద్రబాబు పేరు పెట్టామని, దీనిని రాజకీయం చేయడం తగదని అన్నారు.